ఆన్లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపిన ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు..! డిసెంబర్ 6 వరకు గడువు ఇచ్చిన హై కోర్టు

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో సంచలనంగా డ్రీం 11 యాప్, ఆన్లైన్ రమ్మీ ఇతర బెట్టింగ్ లను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో మంది ప్రజలు సమర్ధించారు. దాదాపు రాష్ట్రం అంతా హర్షం వ్యక్తం చేసింది. అయితే దానిని సవాల్ చేస్తూ కొన్ని సంస్థలు కోర్టులో పిటిషన్ వేశాయి. ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైన అంశం అయింది.

 

 

బెట్టింగ్ ల పై ఊచకోత

ఆన్లైన్ రమ్మీ. బెట్టింగ్ లను నిషేధిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఏపీ గేమింగ్ చట్టంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో డిసెంబరు 6 లోపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కూడా డిసెంబర్ 9 కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ కృష్ణమోహన్ లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది.

గడువు తగ్గింపు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ ప్లే గేమ్స్ 24/7 ప్రైవేట్ లిమిటెడ్ మరికొన్ని సంస్థలు హై కోర్టును ఆశ్రయించాయి. కౌంటర్ వేయడానికి మూడు వారాలు కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి అంత సమయం ఇవ్వవద్దు అంటూ కోర్టు వారిని అభ్యర్థించారు. ఇరువైపు వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం డిసెంబరులో చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ సదరు బెట్టింగ్ నిర్వహణ సంస్థలు వేసిన పిటిషన్ ఖచ్చితంగా కొట్టివేయబడింది అని అందరూ భావిస్తున్నారు.

అడుగడుగునా ప్రశంసలే

ఇదంతా పక్కన పెడితే…. జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకుమ్మ విప్లవాత్మక నిర్ణయానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఎంతోమంది ఆన్లైన్లో చట్టబద్ధం అని బెట్టింగులు వేసి లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. వారిలో అధిక శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలే కావడం గమనార్హం. మరి హైకోర్టు వారు చివరికి వాదనలు విని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తారో వేచి చూడాలి. ఈ నిర్ణయాన్ని బట్టి దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని సంచలనమైన పరిణామాలు చోటుచేసుకునే చాన్స్ ఉంది.