NewsOrbit
బిగ్ స్టోరీ

సరే కృష్ణ, సీనియర్ లాయలిస్ట్

 

ఏపీలో మీడియా సంగతి చెప్పాల్సి వస్తే అది బతికుందో చచ్చిందో ఎవరికీ తెలియదు. అసలు అర్థం కాని పరిస్థితి… అసలు జర్నలిస్టులు ఉన్నారా అంటే అదో అనుమానం ఎవరికైనా… ఒక సామాజికవర్గం చేతిలో మీడియా సింహభాగం… ప్రీ ప్లాన్డ్ ఎజెండా ప్రకారం పనిచేస్తుంటే ఇక వేరే ఉద్దేశాలు ఎలా కన్పిస్తాయ్.

 

వారి ఆలోచనలు, వారి ఆకాంక్షలు… వారి ప్రయోజనాలే వార్తలవుతాయ్… ఎజెండాగా మార్చేసేలా కార్యాచరణ పనిచేస్తున్నప్పుడు మిగతా వార్తలకు చోటు ఎక్కడుంటుంది. ఇది దశాబ్దాలుగా జరుగుతున్న తంతే. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అని… ఒక పద్ధతంటూ చాన్నాళ్లుగా ఉపన్యాసాలు చెప్పిన పెద్ద మనుషులే… మీడియాను సొంత అవసరాల కోసం జనాలను మోసం చేయడానికి సందర్భానుసారం ఆడుతున్న వింత నాటకం విడిపోయిన ఆంధ్రప్రదేశ్‎లో కళ్ల ముందు చూడాల్సి వస్తోంది.
ఈ వ్యవహారాన్నంతా… చేసుకోలేని దైన్యం మరో మీడియాది. అక్కడ పెద్ద ఎత్తున పనిచేస్తున్న అడ్వైజర్లది. వారంతా ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు.

మీడియాతో పనేంటని భావిస్తోంది ఆ వర్గం. అసలు మీడియా అవసరం లేదన్నది వారి ఉద్దేశం. రాయల్‎గా సోషల్ మీడియా ఉందన్న వారి ఆలోచన. జనం మాత్రం ఏది నిజం… ఎవరు నిజం అన్న చర్చ జరిగేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వార్తలను వండుతున్న తీరు ఇప్పుడు మీడియా విలువలను ప్రశ్నార్థకం చేసేస్తోంది.
మీడియా గురించి మేనేజ్మెంట్ల గురించి వచ్చే రోజుల్లో కూలంకషంగా చెప్పుకుంటాం గానీ… ఇప్పుడో జర్నలిస్ట్ చేస్తున్న అరాచకాలు గురించి చూద్దాం. (అక్రమాలు, దందాలు, పంచాయితీలు కాదండీ. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం… ఇప్పుడు ఆన్ స్క్రీన్లో ఆ పెద్ద మనిషి మాట్లాడుతున్న భాష, సొల్లు, ఓవరాక్షన్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం.)

ఆ చానెల్ నిజాలు మాత్రమే చెబుతానంటుంది. బోల్డంత దమ్ముందంటూ జబ్బచరుస్తోంది. ఆ చానెల్ ఓనరే జనాలకు, నేతలకు వారానికోసారి కమ్మగా పలుకుతారు. సరే వారానికి ఒకసారే కదా అని జనం లైట్ తీసుకుంటారు.
ఇప్పుడు కొత్తగా ఆ చానెల్లోకి ఓ వీరుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నికల్లో పచ్చదండుకోసం కొత్త రాష్ట్రంలో ఏర్పడిన చానెల్‎ని సంకనాకించేసి… ఇప్పుడు దమ్ము చూపిస్తానంటూ స్క్రీన్‎పై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకుంటున్నాడు. తెలుగు సీరియళ్లలో లేడీ విలన్స్ డైలాగులకు ఏమాత్రం తీసిపోకుండా శాపనార్థాలు పెట్టేస్తున్నాడు. ఆ తీర్పులు చూసి… సైడ్‎లో వస్తున్న కామెంట్లు చూస్తే అక్కడ యూట్యూట్ టీంకు చెమటలు పట్టేస్తున్నాయ్. కొందరు చానెల్ కమ్మగా చూస్తూంటే… మరికొందరు కౌంటర్లు పెట్టడానికే అక్కడ వాలిపోయి ఉంటారు.

మొన్నటి వరకు విజయవాడ కేంద్రంగా పనిచేసిన చానెల్లో పచ్చ తంత్రంతో చెలరేగిపోయిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు కమ్మగా పచ్చ స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్న షోలు చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. నాడు పచ్చ పార్టీ కోసం ఒళ్లంతా పసుపుపూసుకున్న ఆ జర్నలిస్ట్ విన్యాసాలు తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు, రాజకీయా నాయకులకు చాలా బాగా తెలుసు. తాజాగా సరే కృష్ణ చానెళ్లో చేస్తున్న లైవ్ షోలో ఓ వ్యక్తి… చేసిన కామెంట్స్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయ్… మీ యాక్టింగ్‎కు, మీ మసాలా తాలింపు కబుర్లుకు, మీ నటనా చాతుర్యంకు Take a Bow అంటూ రాసుకొచ్చాడు. కానీ జనం మీ యాక్టింగ్ ను నమ్మడం లేదు సార్. ఇకనైనా మారండంటూ రాసుకొచ్చాడు. ఇది కేవలం ఒక్క వ్యక్తి అభిప్రాయం మాత్రమే కాదు… ఇలాంటి వర్షన్ చాలా మంది నుంచి వస్తోంది. మొత్తంగా సరే కృష్ణ పెద్దగా చదువుకుంది లేకపోయినా ఆయన తెలుగుతో తెగులు సృష్టిస్తూ రాక్షసానందం పొందుతున్నాడు.

మొత్తంగా ఆయన షో చూసిన తర్వాత ఆ భాషేంటి… ఆ మాటలేంటి… అసలునువ్వు జర్నలిస్టువా… కార్పోరేటిస్టువా… పార్టీ అధికార ప్రతినిధివా… నువ్వెవరని ప్రశ్నించకుంటే అదో పెద్ద సమాధానంలేని పజిల్ అవుతుంది. నమ్మక ద్రోహం, నయవంచన, తడిగుడ్డతో గొంతుగోయడం లాంటి పదాలు ఒక యాంకర్… అదీ ఒక డిబేట్లో వాడటం ఎప్పుడైనా చూశారా… నమస్కారాలు… సమస్కారాలు లేవంటూ ఇస్తున్న కొటేషన్లు కొందరికి ఇంపుగా ఉండొచ్చు… జనం మాత్రం కచ్చితంగా చీదరించుకుంటారు. అసలే ప్రైవేటు యాజమాన్యాలు… ఆపై సొంత ఎజెండా ప్లాట్ ఫామ్‎లు… ఇప్పటికే చినబాబు కాపాడుకుంటా వచ్చాడన్న ఇంప్రషన్ మర్కెట్లో ఉంది సరేనా కృష్ణ… జర పైలం

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju