NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

సొంత పార్టీ పై కన్నెర్ర చేసిన పవన్ కళ్యాణ్..! ఇది అలవాటే గా….

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అన్న అనుమానాలు మధ్య తాను ఇక్కడే ఉంటాను అని స్పష్టం చేసిన పవన్ వరుసగా సినిమాలకు సంతకం చేశాడు. ఇప్పుడు తాజాగా పవన్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ బాగా చర్చనీయాంశం అయింది.

 

ఇలా చేయడం సరికాదు….

పార్టీలో కొంతమందికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పిన పవన్ వారు వెళ్లి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మితిమీరి మాట్లాడుతున్నారని సొంత పార్టీలోని కొందరు నేతల వైఖరిని ఆయన తప్పు పట్టారు. నాయకులు నచ్చకపోతే తమ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని తమకు హేతుబద్ధత తెలియజేస్తే దానికి పరిష్కారం చూస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక అలా మాట్లాడాలి అనుకున్న వారు జనసేన నుండి బయటకు వెళ్లిపోయి మాట్లాడుకోవాలని పార్టీలోనే ఉంటూ ఇలా మాట్లాడితే మాత్రం కచ్చితంగా కుదరదని పవన్ నేరుగా స్పష్టం చేశాడు

రాజకీయాలేమన్నా సరదానా?

ఈ సందర్భంగా పార్టీ నుండి వంద మంది వెళ్ళిపోతే తను బలహీనపడే వ్యక్తిని కాదని చెప్పిన పవన్ కళ్యాణ్ వెయ్యి మందిని తీసుకొని వచ్చి పార్టీని బలపరుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. గడ్డాలు పెట్టుకొని బుజ్జగించడం…. బ్రతిమిలాడడం తమ దగ్గర ఉండదని జనసేనాని స్పష్టం చేశాడు. రాజకీయాలు తనకేం సరదా కాదని తనకు ఉన్న బాధ్యతను ప్రతి ఒక్కరు ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. అయితే పవన్ పేర్కొన్న అంశాన్ని గమనించిన పార్టీ కార్యకర్తలు ఏ నేతల గురించి ఆయన ఇలా మాట్లాడుతున్నారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు అయితే పవన్ ఈ స్థాయిలో అసహనం చెందాడు అంటే వారు కచ్చితంగా ఎవరో ముఖ్యనేతలు అయి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

చక్కబెట్టేది ఏదైనా ఉందా ఇంతకీ?

ఇక ఈ విషయంలో మరింత ముందుకు వెళ్తే…. జనసేన నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దగ్గర నుండి మరికొంతమంది నేతలు జనసేనలో ఉంటూనే ఆ పార్టీ వైఖరి వ్యతిరేకిస్తున్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ప్రజలకు సమస్య వస్తే ముందుగా పవన్ పేరు గుర్తు వస్తుంది అన్నది కొందరి మాట. అలాంటి పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీలోని వ్యవహారాలను చక్కబెట్టుకోవడంలో విఫలం అవుతున్నాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే కొనసాగితే పార్టీ కేడర్లో ఉత్సాహం లోపించి తర్వాత ఎన్నికల్లో పార్టీ మరింత బలహీనపడుతుంది. మరి పవన్ పై ట్విట్టర్ లో పోస్ట్ లు వేయడమేనా…. అసలైన చోట కార్యాచరణ చూపుతాడా లేదా అన్నది వేచిచూడాలి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !