మాట్లాడింది రోజా ఒక్కటే… రాలింది మాత్రం మూడు పిట్టలు

వైసిపి పార్టీ ఎమ్మెల్యే ఫైర్బ్రాండ్ లీడర్ రోజా సెల్వమని మరొకసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను పరువు తీసేలా…. కించపరిచేలా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సందు దొరికితే చాలు రోజా పవన్ రెచ్చిపోవడానికి రెడీగా ఉంటుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపిన తర్వాత బిజెపి పార్టీ వారి మాట మేరకు వెనక్కి తగ్గడం చూసి రోజా మరింత విరుచుకుపడింది.

 

హైదరాబాద్ లో అమ్ముడుపోయిపవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కూర్చున్నాడని ఆరోపణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రస్తావనే లేదని ఆమె తేల్చి చెప్పింది. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎక్కడికి వెళ్లినా తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేసింది. జనసేన పార్టీని ప్రజలు పట్టించుకోవడం మానేశారని చెప్పిన ఆమె హైదరాబాద్ లో పోటీ నుండి తప్పుకున్నందుకు పవన్ డిల్లీ వెళ్లి తిరుపతి సీటు కావాలని బేరం చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అదే ఊపులో గతాన్ని తవ్వి 2014 ఎన్నికల్లో టిడిపిని గెలిపించిన పవన్ కళ్యాణ్ అప్పుడు వేరే పార్టీకి ఓటు వేయాలని కోరినా ఆయన ప్రత్యేక పార్టీ అసలు పెట్టడం వెనుక అంతరార్థం తనకు తెలియడం లేదని అన్నారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ బిజెపికి తెలంగాణలో పట్టు ఉందేమో కానీ ఏపీలో అసలు సీటు వచ్చే పరిస్థితి కూడా లేదని రోజా అనడం గమనార్హం. ఎవరు గెలిస్తే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. జగన్ పాలన చూసి తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఇక వైసీపీ కార్యకర్తలు సరైన సమయంలో రోజా బయటకు వచ్చి విరుచుకుపడడంతో ఆనందంతో ఉన్నారు. విషయం ఏమిటంటేపవన్ కళ్యాణ్ ఢిల్లీ కి వెళ్ళాడు మరి బీజేపీ జోరుగా అండర్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేసింది. ఇలాంటి సమయంలో టిడిపి నికాదని వీరిద్దరిని విమర్శించి అసలు టిడిపి లెక్కలోకి లేదన్నట్లు చేస్తే తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితే టిడిపి ది అయిపోతుంది. ఇక బీజేపీ జనసేన ఎంతో బలహీన పార్టీలు. వాటిని విమర్శించినా విమర్శించ కపోయినా పెద్దగా నష్టం ఏమీ ఉండదు కాబట్టి రోజా ఇక్కడ టిడిపిని పనిలోపనిగా బిజెపి జనసేన పుంజుకోనివ్వకుండా విరుచుకుపడ్డారు అని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదేనేమో….