NewsOrbit
ట్రెండింగ్ బిగ్ స్టోరీ

ఆర్జీవీ కి షాకులపై షాకులు…! అన్నీ రోజులు ఆటలు సాగవుగా….

భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే రామ్ గోపాల్ వర్మ ప్రస్థానం చాలా గొప్పది. ఇప్పటి వరకు దేశంలో చలనచిత్రాలను ప్రేక్షకులు సినిమా చూసే తీరుని మార్చేసిన అతి కొద్దిమంది దర్శకుల్లో ఆయన ఒకడు. భారతదేశం నుండి వచ్చిన అతి గొప్ప డైరెక్టర్లలో వర్మ పేరు ఎప్పటికీ ఉంటుందని ఎంతో మంది ప్రముఖులు చెప్పారు. అయితే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అతి కొద్ది కాలంలోనే భారీగా మంచి పేరు సాధించిన వర్మ అంతే త్వరగా కెరీర్ లో పతనం కూడా చూశాడు. కానీ ఆయనకు ఇవేమీ పట్టవు. ప్రతి రోజు తనని తాను అన్వేషించుకుంటూ ముందుకు వెళ్లడం ఒక్కటే అతనికి తెలుసు.

 

వర్మ మ్యాజిక్ సీక్రెట్స్ ఇవి….

వాస్తవానికి వర్మ సినిమాలు ఫ్లాప్ కావడం మొదలై దశాబ్దం అయిపోతుంది. అతను చివరగా హిట్ కొట్టిన చిత్రం రక్త చరిత్ర మొదటి భాగం. ఇక వివాదాస్పద అంశాల నేపథ్యంలో లేదంటే బూతు కంటెంట్ తో సినిమాలు తీయడం.. పబ్లిసిటీ గిమ్మిక్కులు, ఓ వర్గం ప్రేక్షకులు నొప్పించినా మరో వర్గం వారిలో ఆసక్తి పెంచడం…. ఇలా సొమ్ము చేసుకోవడం వర్మ అలవాటుగా మార్చుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ ఎక్కువ ప్రమోషన్ తో డబ్బు బాగానే వెనుకేశాడు.

గడ్డు కాలం మొదలు….

అయితే లాక్ డౌన్ సమయంలో ఎంతో వినూత్నరీతిలో పే పర్ వ్యూ పద్ధతిలో కొన్ని సినిమాలు విడుదల చేసిన ఆర్జీవీకి మొదట్లో భారీ లాభాలు వచ్చాయి. పెట్టుబడి లక్షల్లో కోట్లలో కానీ ఇప్పుడు అలాంటి జిమ్మిక్కులు జనాల ముందు పని చేయడం లేదు. వర్మ ఎంత సెన్సేషనల్ స్టోరీ తీసుకున్నా జనాల్లోకి కనీస ఆసక్తి కనిపించడం లేదు. చివరిగా వర్మ పే పర్ వ్యూ స్టైల్ లో విడుదల చేసిన అతి కొద్ది రెస్పాన్స్ కూడా కరువైంది. ఇక దీనికి తోడు అతని సినిమాలకు వరుసగా లీగల్ ఇష్యూ లు మొదలవుతున్నాయి. రిలీజ్ ఆలస్యం అయిపోతుంది…. ఈలోపల ప్రేక్షకులకు ఆసక్తి కాస్త పోతోంది.

అడుగడుగునా అడ్డంకులే….

తాజాగా మిర్యాలగూడ ప్రణయ్-అమృత ల కథతో తెరకెక్కించిన మర్డర్ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేకపోయింది. ప్రణయ్ తండ్రి ఈ సినిమా విడుదలను ఆపివేయండి అంటూ పెద్ద రచ్చ చేశాడు. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ సినిమా పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఆమె తల్లిదండ్రులు సైతం తమ కూతురి ఘోరమైన మరణాన్ని జనాలు చూడడం ఇష్టం లేదని అడ్డం కూర్చున్నారు. ఇక కరోనా వైరస్ పై సినిమా తీస్తే అసలు దాని రివ్యూలు కూడా జనాలకు కనబడకుండా పోయాయి.

సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసినా ఆశించిన రెస్పాన్స్ లేదు కాబట్టి లాక్ తర్వాత రిలీజ్ చేస్తాను అని వర్మ ప్రకటించినప్పటికీ పట్టించుకునే నాధుడు లేడు.. ఇలాంటి అతి దీనమైన పరిస్థితిలో వర్మ తిరిగి పుంజుకుంటాడా లేదా ఇదే వర్మ కెరీర్ కు ఇక చరమగీతమా అన్నది వేచి చూడాలి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri