Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ Chiranjeevi Oxygen Banks మెగాస్టార్ గా తెలుగు సినిమాను సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నెంబర్ వన్ హీరోగా ఏలేశారు.. ఏలుతున్నారు కూడా. డ్యాన్సులు, ఫైట్లతో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించి.. మిగిలిన హీరోలు తప్పక చేయాల్సిన పరిస్థితి కల్పించారు మెగాస్టార్. అప్రతిహత ఫ్యాన్ బేస్ తో ఆయనకు ఎదురేలేకుండా పోయింది. సాయం, సేవల్లో కూడా తనదైన మార్క్ వేశారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్ గా కరోనా సమయంలో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్’ ఏర్పాటు చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. అయితే.. బాలీవుడ్ నటుడు సోనుసూద్ కు కల్పించిన ప్రచారంలో కొంతైనా తెలుగు మీడియా చిరంజీవి చేస్తున్న సాయానికి ప్రచారం కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకో (తెలంగాణలో ఉమ్మడి జిల్లాల్లో) ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఇందుకు ఆయన సొంతంగా ఖర్చు పెడుతున్నారు. ఒక్కో బ్యాంక్ కు దాదాపు 60-80 లక్షలు అవుతుందని అంచనా. కోట్లు ఖర్చు చేసి తనను అభిమానించి తెలుగు ప్రజలకు తనవంతు సాయం చేయాలని పూనుకున్నారు. అయితే.. చిరంజీవి చేస్తున్న ఈ సాయాన్ని ప్రజలకు చేరువ చేయడంలో తెలుగు మీడియా పక్షపాత ధోరణి చూపుతోందనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఇంతపెద్ద సాయాన్ని కేవలం సినిమా వార్తల్లో నిముషం, రెండు నిముషాల వార్తగా చూపి చిరంజీవి సాయాన్ని తక్కువ చేస్తున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేస్తే అవసరమైన వారికి సాయం అందుతుంది.
Read More: Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్..! నిన్న కర్ణాటకలో.. నేడు గుంటూరులో.. ప్రారంభం
ఇదే పని చేస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు తెలుగు మీడియా ఇచ్చిన ప్రచారంతో పోలిస్తే పదో వంతు కూడా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ పై ప్రచారం కల్పించలేదనేది వాస్తవం. చిరంజీవిలా మరే సూపర్ స్టార్, పెద్ద హీరో ఇన్ని కోట్లు ఖర్చు చేసి ప్రజలకు సాయం చేసేందుకు కార్యరంగంలోకి దిగలేదని ఫ్యాన్స్ అంటున్నారు. తెలుగు వ్యక్తి, అందునా చిరంజీవిపై ఉన్న ధ్వేషంతోనే సినిమా వార్తల్లో చూపారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రజలకు వార్తలు చేరవేయాల్సిన మీడియా.. కరోనాపై జాగ్రత్తలు చెప్పే మీడియా.. అవసరార్ధం ఆక్సిజన్ బ్యాంకులు ఇక్కడా ఉన్నాయని చెప్పడానికి మీడియా మైకులు, పెన్నులు కదలడం లేదని విమర్శలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!