NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

అవినాష్ బిగ్ బాస్ కు వచ్చే ముందు జరిగిన పంచాయతీ తెలిస్తే… అయ్యో పాపం అనేస్తారు…!

బిగ్బాస్ ఇంటిలో రోజుల తర్వాత అడుగుపెట్టిన జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ఫైనల్స్ కు రెండు అడుగుల దూరంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే మంచి ఎంటర్టైనర్ గా గుర్తింపు పొందిన అవినాష్ బిగ్బాస్ ఇంట్లోకి రావడానికి ముందు ఎదుర్కొన్న పరిణామాలు గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా వెల్లడించాడు…

 

లైఫ్ ఇచ్చింది వారే…

నిజంగా చెప్పాలంటే అవినాష్ ఎవరో తెలియని రోజుల్లో మల్లెమాల సంస్థవారు జబర్దస్త్ లో అతనికి లైఫ్ ఇచ్చాడు. అతను, కెవ్వుకార్తిక్ కలిసి ఒక టీం మొదలుపెట్టాడు. తమదైన శైలిలో స్కిట్లు చేస్తూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అందుకు తగ్గట్టుగానే వారికి సినిమాల్లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అయితే అవినాష్ కు ఒక్కసారిగా ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. అటు ఆర్థికంగా అతను పుంజుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులిద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో బిగ్ బాస్ అతని తలుపుతట్టింది. ఇది మనకు తెలిసిన కథ.

తప్పలేదు…

ఈ విషయంలో అవినాష్ మరింత లోతుగా వివరిస్తూ చెప్పింది ఏమిటంటే… కరోనా సమయంలో అతనికి జబర్దస్త్ లేదు. ఈవెంట్లు లేవు. సినిమాలు దగ్గరనుండి అవకాశాలు లేవు. ఇలాంటి సమయంలో ఒక కళాకారుడు బ్రతకడం చాలా కష్టమైన విషయం. అప్పుడు బిగ్ బాస్ వారు ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణుగుతుంది అన్న ఆశతో తాను మల్లెమాల వారికి రుణపడి ఉన్నానని ఇలాంటి సమయంలో షో లో పాల్గొనలేను అని చెప్పేశాడు. కానీ వారు నెలల తరబడి అతడిని అడుగుతూనే ఉన్నారు. కొద్ది నెలల ముందే కొత్తగా ఇల్లు కూడా తీసుకున్నాడు. వారి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు డబ్బులు కావాలి… ఇంటి కి తెచ్చిన అప్పు తీర్చాలి. బిగ్ బాస్ ఆఫర్ ఎలాగూ టేబుల్ పైన ఉంది జబర్దస్త్ ఇప్పుడల్లా మొదలయ్యేది లేదు. అందుకని హౌస్ లోనికి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు.

అలా బయటపడ్డాడు….

ఇలాంటి సమయంలోనే అతనికి ఒక షాక్ తగిలింది. మల్లెమాల వారి తో ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం జబర్దస్త్ తప్పించి మరే ఇతర కామెడీ షోలో పాల్గొనకూడదని ఒప్పందం చేసుకున్నారు. ఇక అవినాష్ వాదన ఏమిటంటే అది కామెడీ షో కాదు రియాలిటీ షో అని. అయినప్పటికీ మల్లెమాల వారు అగ్రిమెంట్ ప్రకారం జబర్దస్త్ వీడి వెళ్ళిపోతే పది లక్షల రూపాయల పరిహారం కట్టవలసి ఉంటుంది అని తేల్చిచెప్పారు. అవినాష్ ఇన్ని సంవత్సరాలు వారితో పాటు నమ్మకంగా చేశాను… వారు నా మీద కొంచెం కూడా కనికరం చూపించలేదు అని ఇంటర్వ్యూలో వాపోయాడు. ఇక అలాంటి పరిస్థితుల్లో అతనికి శ్రీముఖి, అభి, ధనరాజ్ వంటి తన ఫ్రెండ్స్ డబ్బులు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. ఆ మొత్తం మల్లెమాల వారికి కట్టి ఇక ఆ సంస్థ నుండి బయటకు వచ్చేసినట్లు తెలిపాడు.

కట్ చేస్తే… బిగ్బాస్ ఇంటిలో ఎంటర్ అయిన తర్వాత ఒక నాలుగైదు వారాలు అతనిదే హవా. ఇక మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న అవినాష్ ఆటను కూడా చక్కగా ఆడాడు అని చాలామంది అభినందించారు. ఇవన్నీ పక్కన పెడితే అతని అప్పులు తీరిపోయాయి. మెడికల్ ఖర్చులకు డబ్బులు వచ్చి ఇంకా మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి అవినాష్ సరైన నిర్ణయం తీసుకున్నాడు కానీ మధ్యలో ఎంతో మానసిక వేదన అనుభవించినట్లు చెప్పాడు. ఒకానొక సమయంలో తను కొత్తగా కొనుక్కున్న ఇంటి పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పటికీ మల్లెమాల వారు మళ్లీ రావద్దని చెప్పినట్లు తెలిపిన అవినాష్ వారు మాత్రం కబురు పెడితే తప్పకుండా వెళ్తానని అలా జరగాలని కోరుకుంటున్నట్లు కూడా చెప్పాడు.

Related posts

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N