NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

Vakeel Saab: పవన్ వైఫల్యం అక్కడే..! డైలాగులకు, నిజాలకు చాలా తేడా..!!

Vakeel Saab: dialogues VS Reality

Vakeel Saab: వకీల్ సాబ్ సినిమా ఎలా ఉంది..!? ఎన్ని కోట్లు వెనకేస్తుంది..!? ఎన్ని రోజులు ఆడుతుంది..!? ఇవన్నీ సినిమా లెక్కలు. ఇక్కడ అప్రస్తుతం.. ఒక రాజకీయ నాయకుడు.. సినిమాల్లో హీరోగా నటిస్తున్నప్పుడు రాజకీయ ప్రేరేపిత సినిమా డైలాగులు బోలెడు ఉంటాయి. హీరో అయినా బిల్డప్ డైలాగులు చెప్తుంటారు.. ఆ హీరో చుట్టూ ఉన్నవాళ్ళైనా ఆ పాత్రను పొగుడుతూ డైలాగులు పిలుస్తుంటారు. వకీల్ సాబ్ సినిమాలో ఇటువంటి డైలాగులకు కొదవేం లేదు. మూడేళ్ళ విరామం తర్వాత హీరోగా పవన్ కళ్యాణ్ తెరపైకి కనిపించడంతో.. అతని ఓటమి, అతని రాజకీయ గతం, భవితవ్యం కనిపించేలా కొన్ని డైలాగులు రాశారు. కానీ వారికి పవన్ నిజ జీవితంలో అమలు చేస్తున్న వాటికీ అసలు సంబంధమే ఉండడం లేదు..! ఉదాహరణకి కొన్ని చూద్దాం..!!

Vakeel Saab: dialogues VS Reality
Vakeel Saab: dialogues VS Reality

Vakeel Saab: అసందర్భం – అతి – అసలు వేరు..!!

* సినిమా చివర్లో “మనం పోరాడుదాం. మీ కోసం నేనున్నాను. కలిసి పోరాడుదాం” అంటూ పవన్ కళ్యాణ్ చెప్తారు. ఇది రాజకీయ ప్రేరేపిత డైలాగ్. పేదల తరపున పోరాడడానికి తాను సిద్ధం అని పవన్ ప్రకటించుకున్నట్టు. బాగానే ఉంది. కానీ వాస్తవానికి.. ఆ ఉద్దేశం ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చంక ఎందుకు ఎక్కినట్టు..!? 2014 లో ఫ్రెండ్షిప్ చేసి.. 2017 నాటికి వాళ్ళ వైఖరి నచ్చక.. 2019 ఎన్నికల్లో వాళ్ళని విమర్శించి.. మళ్ళీ 2020 నాటికి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు..!? పోరాటమేదో చేయొచ్చుగా. “ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ స్టీల్ పరిశ్రమ” వంటి అనేక అంశాలపై పోరాటం చేయకుండా ఎందుకు చంకలో కూర్చున్నట్టు..!?

Vakeel Saab: dialogues VS Reality
Vakeel Saab: dialogues VS Reality

* “ఆశతో ఉన్నోడికి గెలుపోటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి ప్రయాణం మాత్రమే ఉంటుంది” పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓటమిని కవర్ చేసుకుంటూ.. తనకు ఓటమి అంటే లెక్కే లేదని.., ప్రయాణం కొనసాగిస్తానని చెప్పారు. బాగానే ఉంది..! కానీ వాస్తవానికి.. పవన్ ఓటమి చెందిన భీమవరం, గాజువాకలో పవన్ మళ్ళీ ఏం చేశారు..!? ఎప్పుడైనా ఆ నియోజకవర్గాల్లో పర్యటించారా..!? ఆ పేదల కోసం, ఆ ఓటర్ల కోసం నిలబడ్డారా..!? ఆ నియోజకవర్గాల్లో ఓడిన తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు..!? వాళ్ళతో ఎందుకు ప్రయాణించడం లేదు..!? అతి బిల్డప్పు డైలాగులు కాకపోతే వాస్తవానికి.. పవన్ నైజానికి ఈ డైలాగులు ఏ మాత్రం సరిపోలేదు.. “ఓటమి అంటే అవమానం కాదు – మనల్ని మనం గెలుచుకునే అవకాశం” ఇది కూడా అదే కోవకి వస్తుంది. తన ఓటమిని ఒప్పుకున్నట్టు మనస్ఫూర్తిగా చెప్పారు. కానీ తనను, తాను ఏ విధంగా గెలుచుకుంటున్నారో పవన్ కైనా అర్ధమవుతుందా..!? బీజేపీకి బానిసవ్వడం ద్వారా… ఏం గెలుస్తున్నట్టు..!?

Vakeel Saab: dialogues VS Reality
Vakeel Saab: dialogues VS Reality

* “బలహీనంగా ఉన్నదాని గురించి బలంగా నిలబడతాడు. తనకి ఏది ఉందొ.. అందరికీ అదే ఉండాలి అనుకుంటాడు. “ఇప్పుడు జనాలకు నీ అవసరం ఉంది”.. ఈ భారీ డైలాగులు మరీ అతిని ప్రదర్శిస్తాయి. కోర్టులో ఆవేశపడి.. విచారణని ఎదుర్కొన్న పవన్ కి.. అతనిపై విచారణ చేసి.. వార్నింగ్ ఇచ్చిన శరత్ బాబు చేత ఈ డైలాగు చెప్పించారు. “జనానికి నీ అవసరం ఉంది” ఎక్కడ.. ఏ జనాలకు ఉంది..!? పవన్ కళ్యాణ్ లో డెడికేషన్ ఓ సారి ప్రశ్నించాల్సిందే..! 2015 నుండి 2018 వరకు శ్రీకాకుళం ఉద్దానం సమస్యపై పోరాడి.. అక్కడ పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత దాన్ని వదిలేసారు. సమస్య అపరిష్కృతంగానే ఉంది. కిడ్నీ వ్యాధులు పెరిగాయి. ఇప్పటికీ శుద్ధ జలం అందడం లేదు. ఉద్దానం సమయ పరిష్కారం అవ్వలేదు. అప్పటి హామీలు, హామీలుగానే మిగిలాయి. దీన్ని ఎందుకు పవన్ వదిలేసినట్టు..!? ఇప్పుడు పవన్ ఉన్న పరిస్థితుల్లో బీజేపీని గట్టిగా అడిగితే ఉద్దానం ప్రాంతానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే వీలుంది. పోలవరానికి నిధులిచ్చే వీలుంది. హోదా స్థానంలో మంచి ప్రాజెక్టులు ఇచ్చే వీలుంది. కానీ పవన్ సభల్లో ఆవేశ డైలాగులు.. సినిమాల్లో అతి డైలాగులు తప్పితే వాస్తవానికి దగ్గరున్న రాజకీయ నేతగా కాలేకపోతున్నారు..!!

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju