Naga Chaitanya: పాన్ ఇండియా స్థాయిలో నాగ చైతన్య హిట్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరుకు ఆయన నటించిన ఏ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అలరించలేకపోయాయి. దాంతో ఈ సారి రాబోయే సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. చందూ ముండేటి దర్శకత్వంలో చేయబోయే పాన్ ఇండియా సినిమా కోసం హీరో నాగ చైతన్య తెగ కష్టపడుతున్నాడు. దీని కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. జాలర్లతో మాట్లాడటం, వారి జీవన విధానం, సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు. సముద్రంలో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కొంటారు. పడవలను ఎలా నడుపుతారు. వలలు వేయడం.. చేపలు పట్టడం వంటి విషయాలపై శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లోనే అతి భారీ బడ్జెట్‌తో కూడుకున్న సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమాకు చిత్ర యూనిట్ ‘తండేల్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారట. ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడట. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి..
‘తండేల్’ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవిని ఎంపిక చేయనున్నట్లు చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే డైరెక్టర్ చందూ ముండేటి.. సాయి పల్లవికి కథను వినిపించారని, దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇది వరకే సాయిపల్లవి, నాగ చైతన్య కలిసి ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటించారు. పల్లెటూరి అమ్మాయి, అబ్బాయిగా.. ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దాంతో ‘తండేల్’ దర్శక నిర్మాతలు కూడా ఇదే జోడీని మళ్లీ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్ చేయనుందా?
‘గీతా ఆర్ట్స్ బ్యానర్’పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ అదే జరిగితే సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అనిరుధ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘విక్రమ్, జైలర్’లోని కొన్ని పాటలు ప్రేక్షకులను గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అదే ఊపులో ‘తండేల్’ సినిమాకు పాటలు అందిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. దీనిపై కూడా త్వరలో చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.

సినిమా స్టోరీ..
‘తండేల్’ సినిమా పూర్తిగా జాలర్ల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లి.. అక్కడ అనుకోకుండా ఒక సంఘటనలో చిక్కుకుంటారు. మరీ ఆ విపత్తు నుంచి బయట ఎలా పడతారు. తిరిగి వారి కుటుంబాన్ని కటుసుకుంటారా?. హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? సాయి పల్లవి- నాగ చైతన్య మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉండబోతుంది? అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యధార్థ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విభిన్న స్టోరీలతో కొత్తగా వచ్చే నాగార్జున కూడా ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్‌నే టచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ అందుకున్న నాగ చైతన్య.. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొడతాడా? వేచి చూడాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ పాన్ ఇండియా స్థాయిలో ఏ సినిమా అలరించలేదు. దీనిపై గత కొద్ది రోజులగా వారిపై ప్రెషర్ ఉందనే చెప్పవచ్చు.