NewsOrbit
Entertainment News సినిమా

NBK 108: బాలకృష్ణ… అనిల్ రావిపూడి సినిమాలో అధికారికంగా హీరోయిన్ కన్ఫామ్ ప్రకటన..!!

Share

NBK 108: నటసింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 108” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబుని అనిల్ రావిపూడి చాలా వైవిధ్యంగా చూపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధిడి పాత్రలో… చూపిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తనదైన కామెడీ జోనర్ లో సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో తెలియజేశారు. బాలకృష్ణ పాత సీరియస్ గా ఉన్న… ఆయన చుట్టుపక్కల పాత్రలు చేసే కామెడీ.. చాలా ఆకట్టుకునే దిశగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Balakrishna official confirmation announcement of heroine in Anil Ravipudi's movie

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించటం జరిగింది. ఇప్పటివరకు కాజల్.. బాలయ్య బాబుతో ఒక సినిమా కూడా చేయలేదు. ఫస్ట్ టైం చేస్తూ ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పెళ్లయిన తర్వాత పిల్లోడు పుట్టాక బాలయ్య బాబు మూవీతో కాజల్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇదే సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల … కూడా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా పండుగకు విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో పూర్తిగా బాలయ్య బాబు తెలంగాణ యాసలో డైలాగులు చెప్పనున్నారంట.

Balakrishna official confirmation announcement of heroine in Anil Ravipudi's movie

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన “వీర సింహారెడ్డి”లో రాయలసీమ యాసలో బాలయ్య పలికిన డైలాగులు… సినిమాని విజయతీరాలకు చేర్చడం జరిగింది. మరి అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. తెలుగు చలనచిత్ర రంగంలో వరుస పెట్టి విజయాలు సాధిస్తున్న దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. తన సినిమాలో ఎంతో వైవిధ్యమైన కామెడీ జోనర్ హీరోలతో పండిస్తూ ఉంటారు. మరి బాలకృష్ణతో ఏ మేరకు కామెడీ చేపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక వాయిదా..!!

sekhar

Ananya pandey : అనన్య పాండేకి టాలీవుడ్‌లో క్రేజ్..లైగర్ రాకుండానే కొత్త ప్రాజెక్ట్స్..?

GRK

సమంత బాటలో మిల్కీ బ్యూటీ

Siva Prasad