నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి మోనార్క్ అన్న టైటిల్ పరిశీలనలో ఉండగా ఇటీవల “BB3” ఫస్ట్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ సంచలనం సృష్ఠించింది. 10 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ రాబట్టి అభిమానులనే కాదు మేకర్స్ ని ఆశ్చర్యరపరచింది. చెప్పాలంటే ఇంతగా రెస్పాన్స్ ఇటీవల బాలయ్య నటించిన ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి.
అయితే ఈ సినిమా తర్వాత నుంచి బాలయ్య దూకుడు పెంచాలని చూస్తున్నారట. గత సినిమాల అనుభవంతో ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ తో పనిచేయాలని అనుకుంటున్నారట. గత సంవత్సరం బాలయ్య నటించిన సినిమాలన్ని దారుణంగా పరజయాన్ని మూట గట్టుకున్నాయి. తన తండ్రి బయోపిక్ ని ఎన్.టి.ఆర్ కథానాయకుడు, ఎన్.టి.ఆర్ మహానాయకుడు అని రెండు భాగాలు తీసి దెబ్బ తిన్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా బాలయ్యకి సక్సస్ ని ఇవ్వలేకపోయింది.
దాంతో తనకి రెండు భారీ హిట్స్ ఇచ్చిన బోయపాటికే అవకాశం ఇచ్చాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ తో బాలయ్య మళ్ళీ ఫాం లోకి వస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరిని లైన్ లో పెడుతున్నారు. అంతేకాదు తనకి కథ చెప్పడానికి వచ్చే దర్శకులకి ఖచ్చితంగా కొత్తదనం ఉంటేనే రమ్మని చెబుతున్నారట. నిర్మొహమాటం లేకుండా ఆయన కోసం ప్రతీ ఒక్కరికి అదే మాట చెబుతున్నారట బాలయ్య. మొత్తానికి బాలయ్య ఇచ్చే క్లారిటి ఒక స్వీట్ వార్నింగ్ లాగాను ఉంది.