Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చేసిన హడావుడి గురించి అందరికీ తెలిసిందే. సినిమా రిలీజై వారం రోజులు దాటుతున్నా, భీమ్లా సెగ ఇంకా తాకుతూనే వుంది. ఎంతైనా పవర్ స్టార్ సినిమా అంటే ఆమాత్రం ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే, ప్రస్తుతం ఈ సినిమా విషయమై OTTల మద్య విపరీతమైన పోటీ నెలకొంది. దాంతో భీమ్లా నిర్మాతల పంట పండుతోంది. పెద్ద హీరోల సినిమాలన్నీ బేసిగ్గా అమెజాన్ ప్రైమ్ వారు భారీ మొత్తాన్ని పెట్టి కొనుగోలు చేసేవారు. ఇక ఆ తర్వాత జీ5 వారు కూడా భారీ మొత్తంలో సినిమాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.
Bheemla Naayak: ఆ మెగా హీరోని పవన్ కళ్యాణ్ తో పోల్చిన రానా ..!!
Bheemla Nayak: భీమ్లా నాయక్ కథ వేరుంటాది!
అయితే మన భీమ్లా నాయక్ సినిమా కోసం ఓ నాలుగైదు OTTలు పోటీపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇపుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వచ్చి చేరింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ఇండియాలో అత్యధిక సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇటీవల వచ్చిన అఖండ సినిమాను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ముందుకు వచ్చినా, దాన్ని పక్కకు నెట్టి డిస్నీ వారు కొనుగోలు చేశారు. ఇపుడు భీమ్లా నాయక్ సినిమా మరి, దానికంటే ఎక్కువగా వీరు పోటీపడి OTT రైట్స్ ని సొంతంచేసుకోవాలని చూస్తున్నారు.
Bheemla Nayak: ఓటీటీలోకి వచ్చేస్తున్న `భీమ్లా నాయక్`.. స్ట్రీమింగ్ అప్పుడేనట!
భీమ్లా నాయక్ దెబ్బ అదుర్స్ కదూ!
భీమ్లా నాయక్ సినిమా ను అమెజాన్ ప్రైమ్ లేదా జీ 5 కొనుగోలు చేస్తాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లైన్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒప్పందం కూడా జరిగిందని అందరూ అంటున్నారు. అతి త్వరలోనే స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అకవాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 4 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!