Allu Arjun: “పుష్ప” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బన్నీ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఐకాన్ స్టార్ బన్నీ మార్కెట్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇటువంటి తరుణంలో తన కెరీర్ కి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో బన్నీ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ భాషల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే “పుష్ప 2” సినిమా చేస్తుండగానే తన కెరియర్ లో మూడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంటపురంలో వంటి మూడు హిట్స్ వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో.. చేసే విధంగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు టాక్.
ప్రస్తుతం మహేష్ బాబుతో త్రివిక్రమ్ మూడో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత వెంటనే బన్నీ ప్రాజెక్ట్ పనులు త్రివిక్రమ్ ప్రారంభించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. వేసవిలో బన్నీ ప్రాజెక్టుకు సంబంధించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు అంట. అతి తక్కువ టైంలోనే ఈ సినిమా చేయటానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!