Pushpa 3: డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐటమ్ స్టార్ హీరోగా గత ఏడాది రిలీజ్ అయిన “పుష్ప” ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ సైతం.. పుష్పలో బన్నీ పలికిన డైలాగులను మరియు డాన్స్ సోషల్ మీడియా లో వీడియోలు చేస్తూ తెగ వైరల్ అయ్యారు. తగ్గేదెలే.. డైలాగ్ మరియు శ్రీ వల్లి పాటకి వేసిన స్టెప్స్..కూడా సామాన్య మొదలుకొని సెలబ్రిటీలు వీడియోలు చేయడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“పుష్ప” గత ఏడాది డిసెంబర్ మాసంలో విడుదలయ్యే ఇండియాలోనే భారీ ఎత్తున కలెక్షన్లు సాధించింది. దీంతో ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. “పుష్ప2” తో మరింతగా అలరించాలని సుకుమార్ సైతం స్క్రిప్ట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ కాకముందే “పుష్ప3” కూడా సుకుమార్ ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.
అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సెకండ్ పార్ట్ లో శ్రీ వల్లి క్యారెక్టర్ ఎండ్ అయిన తర్వాత… ఒక ఫారెన్ లేడీ సుకుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ టాక్. ఫారెన్ లేడీతో మూడో పార్ట్ నీ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని, అందుకోసం హాలీవుడ్ హీరోయిన్ నీ తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వస్తున్న వార్తల్లో వాస్తవం ఏంటో సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!