Samantha: ఐటెం సాంగ్‌తో జనాలను మెప్పించని సమంత చేతికి పాన్ ఇండియన్ సినిమానా..? అంటూ నెటిజన్స్ కొందరు ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారట. ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. సమంత కెరీర్లోనే ఇప్పటివరకు ఐటెం సాంగ్ చేసింది లేదు. కానీ, నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం తెగింపుతో బోల్డ్ మూవీస్, స్పెషల్ సంబర్స్ చేసేందుకు రెడీ అంటోంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కమిటయింది.
అయితే ఈ సాంగ్ కమిటయినప్పటి నుంచి లిరికల్ వీడియో విడుదలయ్యేవరకు అంచనాలు పీక్స్‌లో ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా మాస్ ఆడియన్స్‌లో కాకరేపింది. కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం సినిమా మొత్తంలో మైనస్ ఏదైనా ఉందంటే సమంత చేసిన ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఐటెం సాంగే అని చెప్పుకున్నారు. ముఖ్యంగా సమంత ఫేస్‌లో సాంగ్‌కు తగ్గ ఎక్స్ప్రెషన్స్ లేవని అభిమానులే చెప్పుకున్నారు. అలాంటి సమంత చేతికి ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా ఎలా వచ్చిందంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు కియారా అద్వానీ చేయాల్సిన సినిమా సమంత చేతికి ఎలా వచ్చిందనేది ఇప్పుడు హాట్ టాపిక్.
Samantha: ఇందులో ముందు నుంచి పూజా హెగ్డే, లేదా కియారా అద్వానీ పేరు వినిపిస్తుంది.
నిజంగా సమంత చేతికి ఆ ప్రాజెక్ట్ వచ్చిందా లేదా అనేది క్లారిటీ లేదు. అయితే ఇప్పటికే ఆ స్టార్ హీరో, డైరెక్టర్‌తో సమంత సినిమా చేసింది. కాబట్టి ప్రాజెక్ట్ దక్కినా దక్కే అవకాశం ఉంది. ఎన్.టి.ఆర్ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇందులో ముందు నుంచి పూజా హెగ్డే, లేదా కియారా అద్వానీ పేరు వినిపిస్తుంది. వీరిద్దరు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేశారు. ఇక సమంత ఎన్.టి.ఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. అందుకే ఇప్పుడు మరోసారి వీరి సినిమాలో హీరోయిన్గా తీసుకున్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజమో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తేగాని నమ్మలేము.