Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇటీవలే చిత్రబృం కళావతి పాటను వదిలింది. ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేసిన ఈ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన కళావతి సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఈ ఒక్క సాంగ్‌తో సినిమా మ్యూజికల్ హిట్ అని అభిమానులే కాదు అందరూ భావించారు.
అయితే, తాజాగా పెన్నీ అంటూ సెకండ్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో మహేశ్ బాబు తనయ సితార ఘట్టమనేని కనిపించడం సర్ప్రైజింగ్. సితార సర్కారు వారి పాట సినిమాలో ఉందనే విషయం అసలు మేకర్స్ రివీల్ చేయలేదు. ఉన్నా కూడా సినిమాలోని కీలక సన్నివేశాలలో ఉంటుందని అనుకున్నారు. కాని, మహేశ్ బాబుతో కలిసి పెన్నీ అంటూ సాగే పాటతో సర్ప్రైజ్ చేస్తుందని మాత్రం ఎవరూ భావించలేదు. ఇక పెన్నీ సాంగ్‌లో సితార అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎంతో హుషారైన స్టెప్పులేసి ఆకట్టుకుంది.
Sarkaru Vaari Paata: కళావతి పాటతో చూస్తే పెన్నీ సాంగ్ కాస్త డిసప్పాయింట్ చేసినట్టే.
అయితే, ఇప్పుడు ఈ సాంగ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. బాగానే ఆకట్టుకుందని చెప్పుకుంటున్నా..కళావతి సాంగ్‌తో పోల్చుకుంటే మాత్రం అంత లేదనే మాట వినిపిస్తోంది. పైగా ఈ సాంగ్‌లో మహేశ్ లుక్ అసలు బాగోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పిక్చరైజేషన్ పరంగా ఆకట్టుకోలేదని..ఈ సాంగ్ రిలీజ్‌కు ముందు థమన్ ఇచ్చిన హైప్ సాంగ్‌లో కనిపించలేదనే ప్రచారం జరుగుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సాంగ్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతున్నట్టు ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఏదేమైనా కళావతి పాటతో చూస్తే పెన్నీ సాంగ్ కాస్త డిసప్పాయింట్ చేసినట్టే.