`ఇస్మార్ట్ శంకర్`గా మొన్నటి వరకు టాకీ పార్ట్‌తో బిజీగా ఉన్న హీరో రామ్ ఇప్పుడు ఆడి పాడుతున్నాడు. రామ్ హీరోగా పూరి డైరెక్షన్లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవలే గోవాలో భారీ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈరోజు(బుధవారం) నుండి హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో గ్రాండ్ స్కేల్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. `దిమాక్ ఖరాబ్..` అంటూ తెలంగాణ యాసలో సాగే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యానర్స్‌గా పేరున్న హీరో రామ్ మరోసారి అదిరిపోయే స్టెప్పులతో మెప్పించనున్నాడు. కాసర్లశ్యామ్ రాసిన ఈ పాటను కీర్తన శర్మ, సాకేత్ పాడారు. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మాతలు మారి రూపొందిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!