SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) “సర్కారు వారి పాట”(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా “మేజర్”(Major) సినిమాతో కూడా మహేష్ హిట్ అందుకోవటం తెలిసిందే. కాగా ఇప్పుడు నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. వర్కింగ్ టైటిల్ “SSMB28” గా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో వచ్చే నెల మహేష్ బాబు పుట్టినరోజు నేపథ్యంలో సినిమా టైటిల్ ప్రకటించే ఆలోచనలో డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొన్నటివరకు యూరప్ ట్రిప్పులో ఉన్న మహేష్ బాబు ఇటీవల హైదరాబాద్(Hyderabad) చేరుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ క్రేజ్ ఉన్న ఉపేంద్ర.. త్రివిక్రమ్.. మహేష్ సినిమాలో కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ఉపేంద్ర నటించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గతంలోనే త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన “సన్నాఫ్ సత్యమూర్తి”(Son Of Satyamurthy) లో ఉపేంద్ర(Upendra) నెగటివ్ క్యారెక్టర్ చేశారు. అయితే ఇప్పుడు మరో అవకాశం ఉపేంద్ర కి త్రివిక్రమ్ ఇచ్చినట్లు మహేష్ సినిమా ఆయన చేయనున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ఒకటికి మరొకటి విభిన్నంగా ఉంటాయి. మహేష్ కెరియర్ లో ఈ రెండు సినిమాలు.. నటనపరంగా ప్రేక్షకులు మహేష్ లో కొత్తదనం చూశారు. మరి రాబోతున్న ఈ మూడో సినిమాలో మహేష్ నీ త్రివిక్రమ్ ఏ విధంగా చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.