Sai Pallavi: బాలీవుడ్ నిర్మాణ సంస్థ లో అతి పెద్ద బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ అధినేతగా కరణ్ జోహార్ చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. నిర్మాతగా మాత్రమే కాదు దర్శకుడిగా … స్క్రీన్ రైటర్ గా, నటుడిగా రాణించడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల హవా నడుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు సౌత్ ఇండస్ట్రీ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలను… కరణ్ జోహార్ ఇటీవల లాంచ్ చేస్తూ వస్తున్నారు.
అంతేకాదు బాలీవుడ్ లో సదరు సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకల బాధ్యతను కరణ్ జోహార్ దగ్గరుండి చూసుకుంటున్నారు.. బాహుబలి 2, RRR వంటి భారి సినిమాలను ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ దర్శకులతో కూడా కలిసి పని చేయడానికి కరణ్ జోహార్ ఇటీవల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” కి సహ నిర్మాతగా వ్యహరించడం జరిగింది.
అంతమాత్రమే కాదు సౌత్ లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ప్రతి సినిమా విషయంలో కరణ్ జోహార్ ఇటీవల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల దగ్గుబాటి రానా , సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన “విరాటపర్వం” ట్రైలర్ రిలీజ్ కావడం తెలిసిందే. యుద్ధం మధ్యలో లవ్ స్టోరీ అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన “విరాటపర్వం” ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. “విరాటపర్వం” ట్రైలర్ పై చాలా మంది స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ ట్రైలర్ చూసి తనదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
Karan Johar is impressed by both Sai Pallavi and the launch of Virata Parvam trailer. Karan Johar congratulates Rana and expresses his fandom for Sai Pallavi.
“విరాటపర్వం” ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా చూడటం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. రానా నువ్వు సూపర్ అంటూ… రానా పోస్ట్ చేసిన ట్రైలర్ ట్వీట్ కి రీ ట్వీట్ చేస్తు కరణ్ జోహార్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో హీరోయిన్ సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ అంటూ కరణ్ జోహార్ తన అభిమానం చాటడంతో.. ఆయన పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద నిర్మాతగా దర్శకుడిగా ఉన్న ఆయన సాయి పల్లవిని పొగడటం.. బాలీవుడ్ మీడియాలో సైతం చర్చనీయాంశంగా మారింది.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…