RRR: RRR “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి పలు కీలకమైన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ గెలవడం జరిగింది. దీంతో జాతీయస్థాయిలో కీరవాణి ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్ కి సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కెరియర్లో ఒకానొక టైంలో తనని ఎవరు గుర్తించలేదని చెప్పుకొచ్చారు. తాను ట్యూన్ చేసిన అనేక క్యాసెట్స్ పక్కన పడేశారని… అటువంటి క్లిష్ట సమయంలో రామ్ గోపాల్ వర్మ తనకి అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ సినిమా “శివ” తోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.
ఆ సినిమా ఆయనకి ఆస్కార్ లాంటిది. నాకు రాంగోపాల్ వర్మ “క్షణం క్షణం” సినిమాతో అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఆర్జీవి నాకు ఫస్ట్ ఆస్కార్ లాంటివారు. సో నాకు 2023 కంటే 1991 లోనే ఆర్జీవి రూపంలో ఆస్కారం వచ్చిందని.. కీరవాణి ఎమోషనల్ అయ్యారు. అందరూ పక్కన పెట్టేసి ఎవరు గుర్తించకుండా ఉన్న సమయంలో తనకి రామ్ గోపాల్ వర్మ “క్షణం క్షణం” సినిమా ద్వారా అవకాశం ఇచ్చారు. దీంతో కీరవాణి చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందించారు.
“కీరవాణి అలా పొగుడుతుంటే నేను చనిపోయిన అనే భావన కలుగుతుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళనే ఇంత గొప్పగా పొగుడుతారు” అంటూ.. భావోద్వేగంతో కన్నీళ్లు కారిస్తున్న ఎమోజిలను పోస్ట్ చేయడం జరిగింది. 1991 వ సంవత్సరంలో కీరవాణి ఆర్జీవి తీసిన “క్షణం క్షణం” సినిమాతో ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ సినిమా రాకముందు చాలా పాటలు ఆయన చేసిన గాని ఎవరికీ నచ్చలేదు. అటువంటి సమయంలో ఆర్జీవి తనని నమ్మి అవకాశం ఇచ్చినట్లు సో అదే తనకి పెద్ద ఆస్కార్ అని కీరవాణి తెలియజేశారు.