KGF 2: కన్నడ రాక్‌స్టార్ యశ్ తాజా చిత్రమే `కేజీఎఫ్ 2`. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.
2018లో విడుదలై దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన `కేజీఎఫ్ చాప్టర్ 1`కు కొనసాగింపుగా రూపుదిద్దుకున్న `కేజీఎఫ్ 2`.. అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 14న గ్రాండ్‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దుమ్ము దులిపేస్తోంది.
ఇప్పటికే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన యశ్.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసి నయా రికార్డ్ సృష్టించారు. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.09 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ.13.37 కోట్లను రాబట్టింది. రెండో రోజుల్లోనే ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో రూ.33 కోట్ల మేర షేర్ రాబట్టడం ఇదే తొలిసారి. మరి టాలీవుడ్లో ఏరియాల వారీగా కేజీఎఫ్ 2 రెండు రోజుల టోటల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేసేయండి.
నైజాం: రూ. 16.87 కోట్లు
సీడెడ్: రూ. 4.79 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.91 కోట్లు
తూర్పు: రూ. 1.96 కోట్లు
పశ్చిమ: రూ. 1.34 కోట్లు
గుంటూరు: రూ. 1.84 కోట్లు
కృష్ణ: రూ. 1.58 కోట్లు
నెల్లూరు: రూ. 1.17 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ టోటల్= రూ. 32.46 కోట్లు (రూ. 52కోట్లు~ గ్రాస్)
——————————
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా ఇక్కడ క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి రెండు రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా రూ. 46.35 కోట్ల షేర్ ని అందుకుంటే సరిపోతుంది.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!