సినిమా

Sarkaru Vaari Paata: ఏంటి `మ‌హేశా` ఈ స్పీడు.. రెండు రోజుల్లో 2 కోట్లా..?

Share

Sarkaru Vaari Paata: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.

ఇందులో స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్ సంగీతం అందించాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ఓవైపు జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూనే.. మ‌రోవైపు సినిమాకు సంబంధించి వ‌రుస అప్డేట్స్‌ను బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే రెండు రోజుల క్రిత‌మే ఈ మూవీలోని సూప‌ర్ మాస్ సంగ్ `మా.. మా.. మహేషా`ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న ఆ సాంగ్‌.. విడుద‌లైన కాసేప‌టికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన‌ ఈ పాట‌లో మ‌హేశ్‌, కీర్తి సురేష్‌ల ఎన‌ర్జిటిక్ స్టెప్పులు అదిరిపోయాయ‌ని చెప్పాలి.

అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట‌ను జోనితా గాంధీ, శ్రీకృష్ణ ఆల‌పించారు. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఊర‌మాస్ సాంగ్ స‌రి కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసేలా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే ఈ పాట 20 మిలియన్స్ అంటే రెండు కోట్ల‌కు పైగా వ్యూస్ రాబ‌ట్టి.. ఇంకా ట్రెండింగ్‌లోనే వెళ్తోంది.


Share

Related posts

బాలీవుడ్ రీమేక్‌లో…

Siva Prasad

‘సైరా’ ఆత్మీయ సత్కార సభ

Siva Prasad

Acharya: మెగా మల్టీస్టారర్ నుంచి మరో ట్రైలర్..ఎందుకంటే…!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar