త‌లైవి బ‌యోపిక్‌.. డైరెక్ట‌ర్స్‌కి కోర్టు నోటీసులు


విప్ల‌వ నాయ‌కురాలు, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితంపై రెండు బ‌యోపిక్స్‌తో పాటు ఓ వెబ్‌సిరీస్ రూపొందుతున్నాయి. అందులో ఓ చిత్రాన్ని ఎ.ఎల్‌.విజ‌య్ డైరెక్ట్ చేస్తుండ‌గా మ‌రో చిత్రాన్ని ప్రియ‌ద‌ర్శిని డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే వెబ్‌సిరీస్‌ను గౌత‌మ్ మీన‌న్ డైరెక్ట్ చేస్తున్నాడు. జ‌య‌ల‌లిత రాజ‌కీయ జీవితంలో అనే మ‌లుపులున్నాయి. కాబ‌ట్టి ఆమె బ‌యోపిక్‌పై అంద‌రిలో ఆస‌క్తి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. కానీ అస‌లు స‌మ‌స్య జ‌య‌ల‌లిత కుటుంబ స‌భ్యురాలు, ఆమె మేన‌కోడ‌లు దీప నుండి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎదురైంది. త‌మ కుటుంబ స‌భ్యుల అనుమ‌తి లేకుండా సినిమాల‌ను ఎలా చేస్తారంటూ ఆమె కోర్టులో కేసు వేసింది. న‌వంబ‌ర్ 14 లోగా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ కోర్టు ద‌ర్శ‌కుల‌కు నోటీసుల‌ను జారీ చేసింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లేం చేస్తారు? అనేది వేచి చూడాలి.