Bangarraju movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున.. తనయుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన తాజా చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణా సినీ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` మూవీకి ప్రీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు.
ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడటంతో.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బంగార్రాజు చిత్రం సంక్రాంతి బరిలోకి దూకేసింది. విడుదల తేదీనైతే ప్రకటించారు కానీ.. సినిమాకు సంబంధించిన చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయట. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కానందున ఇంకా బంగార్రాజు ఫైనల్ కాపీ సిద్ధం కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అలాగే సినిమా సెన్సార్ కాపీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అందులో కొంత సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉందట. ఈ నేపథ్యంలోనే సినిమా పనులు ఫినిష్ అవ్వకపోవడంతో నాగార్జున డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణపై సీరియస్ అయ్యారని.. ప్రస్తుతం ఫైనల్ కాపీని సిద్ధం చేసేందుకు బంగార్రాజు టీమ్ నిద్రాహారాలు మానేసి మరీ శ్రమిస్తున్నారని టాక్. కాగా, `సోగ్గాడే చిన్నినాయనా`చిత్రం సంక్రాంతికే విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో `బంగార్రాజు`ను కూడా సంక్రాంతికే దింపాలని నాగార్జున బలంగా నిర్ణయించుకున్నారు. అందు వల్లనే ఒకవైపు షూటింగు జరుగుతూ ఉండగానే.. మరోవైపు మేకర్స్ ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఫలితంగా సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!