Pushpa 2: 2021 డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. అన్ని సినిమాలు ఒకే “పుష్ప” సినిమా బన్నీ కెరియర్ లో మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఒక్కసారిగా బన్నీ తలరాత మారిపోయింది. ఈ సినిమాతో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బన్నీ కంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది. పుష్ప సినిమాకి ముందు.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగులో ఇంకా మలయాళం లో మాత్రమే బన్నీ మార్కెట్ ఉండేది. పుష్ప రిలీజ్ అయ్యాక గ్లోబల్ స్టార్ అయిపోయాడు.
గమ్మత్తు ఏమిటంటే “పుష్ప” హిందీలో విడుదల చేసే సమయంలో సరిగ్గా ప్రమోషన్ కూడా చేయలేదు. అటువంటిది అక్కడ ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తగ్గేదేలే… డైలాగ్ విపరీతమైన పాపులర్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఇటీవల బన్నీ బర్తడే సందర్భంగా “పుష్ప” సెకండ్ పార్ట్ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం తెలిసిందే. వీడియో యూట్యూబ్ లో వ్యూస్ మరియు లైకులు పరంగా అనేక రికార్డులు సృష్టిస్తూ ట్రెండింగ్ గా నిలిచింది. ఒక విధంగా యూట్యూబ్ నీ షేక్ చేసి పడేసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ స్పెషల్ వీడియోకి అనూహ్యంగా తెలుగులో కంటే నార్త్ బెల్ట్ హిందీలో అధికమైన వ్యూస్ రావడం జరిగింది.
తెలుగులో 23 మిలియన్ వ్యూస్.. వస్తే హిందీలో 37 మిలియన్ న్యూస్ .. తమిళ్ లో 3.9 మిలియన్ వ్యూస్, మలయాళంలో 1.9 మిలియన్ న్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా 67 మిలియన్ వ్యూస్ తో పుష్ప సెకండ్ పార్ట్ స్పెషల్ వీడియో దూసుకుపోతోంది. రెండో భాగంపై ఈ స్పెషల్ వీడియో అంచనాలు మరింత పెంచేసింది. సో మొత్తం లెక్కలు బట్టి చూస్తే నార్త్ ఇండియా ఆడియన్స్ పుష్ప సెకండ్ పార్ట్ కోసం మంచి ఆకలి మీద ఉన్నట్టు లెక్కలు బట్టి అర్థమవుతుంది. ఈ సినిమాలో కొన్ని పాత్రలలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద చూసుకుంటే దక్షిణాది ప్రేక్షకుల కంటే నార్త్ ఆడియన్స్ పుష్ప 2 కోసం మంచి ఆతృత మీద ఉన్నట్లు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!