`RX 100` చిత్రంలో హాట్‌గా బోల్డ్‌గా నటించి కుర్రకారు మతులు పొగొట్టింది పాయల్ రాజ్‌పుత్. గ్లామర్ పరంగానే కాదు.. నటిగా కూడా మంచి మార్కులను సంపాదించుకుంది. ఈ అమ్మడుకి `RX 100` తర్వాత చాలా అవకాశాలే వచ్చినా.. తనకు నచ్చిన సినిమాలనే సెలక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఆ కోవలోనే పాయల్ రాజ్‌పుత్ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రమే `RDX`. శంకర్ భాను దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. ఈ చిత్రం ఆదివారం విజయవాడ కె.ఎల్.యూనివర్సిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, ఆంధప్రదేశ్ FDC చైర్మన్ అంబికా కృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ చిత్రంలో `అవకాయ బిర్యానీ`, `హుషారు` చిత్రాల్లో నటించి మెప్పించిన తేజస్ హీరోగా నటిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, తేజస్‌లతో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ అంబికా కృష్ణ కొట్టగా.. బుద్ధా వెంకన్న కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సి.కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. బుద్ధా వెంకన్న, అంబికా కృష్ణ స్క్రిప్ట్‌ను అందించారు.