Unstoppable 2: ఆహా “అన్ స్టాపబుల్” టాకీ షో రసవతరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 30వ తారీఖు నాడు ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా ఫ్యాన్స్ డిమాండ్ మేరకు డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం చేసేసారు. అయితే ఈ ఎపిసోడ్ చూడటానికి ఒకేసారి చాలామంది సబ్స్క్రయిబ్ చేయటంతో ఆహా యాప్ స్ట్రక్ అయిపోయింది. దీంతో ఆహా టెక్నికల్ టీం వెంటనే స్పందించి.. సమస్యను పరిష్కరించింది. దీంతో 12 గంటలలో ప్రభాస్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ 50 మిలియన్ వ్యూస్ సంపాదించడం జరిగింది. “బాహుబలి పార్ట్ 1” టైటిల్ తో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావటం జరిగింది.
స్ట్రీమింగ్ చేసిన 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ రావటంపై ప్రకటన చేసి ఆహా టీం సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి… కృతి సనన్ తో ఎఫైర్ గురించి ఇంకా అనేక విషయాలు గురించి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలు వేశారు. ప్రభాస్ చాలా ఎంటర్టైన్మెంట్ తరహాలో సమాధానాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇదే సమయంలో రామ్ చరణ్.. ప్రభాస్ పెళ్లి గురించి చిన్న లిక్ కూడా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
మొత్తం మీద చూసుకుంటే “అన్ స్టాపబుల్” సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ మొదటి భాగం దుమ్ము దులుపుతున్నట్లు రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా పాల్గొనడం జరిగింది. జనవరి ఆరవ తారీకు సెకండ్ పార్ట్ రిలీజ్ కానుంది. ఫస్ట్ టైం బాలకృష్ణతో టాకీ షోలో ప్రభాస్ కనిపిస్తూ ఉండటంతో చాలామంది ఈ ఎపిసోడ్ చూస్తూ ఉన్నారు. సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ హైలెట్ కానున్నట్లు వస్తున్న వ్యూస్ బట్టి తెలుస్తోంది.