Rajamouli Mahesh: “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” తో రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ గుర్తింపు అందుకున్నాడు. “బాహుబలి” తోనే తనకంటూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్న జక్కన్న…”ఆర్ఆర్ఆర్” తో మరోసారి తన డైరెక్షన్ దమ్మేంటో నిరూపించాడు. “ఆర్ఆర్ఆర్” మార్చ్ 25 వ తారీకు రిలీజ్ అయి ఇప్పుడు దేశ విదేశాలలో రికార్డుల మోత మోగిస్తోంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రాజమౌళి టేకింగ్ కి… చరణ్ ఎన్టీఆర్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆశ్చర్య పోయే పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు హీరోలు నువ్వానేనా అన్నట్టుగా సినిమాలో కుమ్మేశారు. గ్యారెంటీగా బాహుబలి రికార్డులు “ఆర్ఆర్ఆర్” బ్రేక్ చేస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు కన్ఫామ్ చేయడం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ విషయంలో “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాల్లో…”ఆర్ఆర్ఆర్”, బాహుబలి కంటే భారీ బడ్జెట్ సినిమాని జక్కన్న చెప్పడం తెలిసిందే. అయితే తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. 800 కోట్ల భారీ బడ్జెట్ తో… మహేష్ సినిమా నిర్మించడానికి రాజమౌళి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతమాత్రమే కాదు ఆఫ్రికా బ్యాక్ డ్రాప్..లో.. జరగనున్నట్లు జేమ్స్ బాండ్ తరహా లో… మహేష్ క్యారెక్టర్ జక్కన్న చెకుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.
హాలీవుడ్ మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకుని… రాజమౌళి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పూర్తిగా ఇంగ్లీష్ వెర్షన్ లో… ఈ సినిమా విడుదల చేయాడనికి జక్కన్న ప్లాన్ చేస్తూనట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్టోరీ విజయేంద్రప్రసాద్.. రాస్తూనట్లు డిస్కషన్ జరుగుతున్నట్లు.. ఇండస్ట్రీ టాక్. బాహుబలి, “ఆర్ఆర్ఆర్” సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఈ సినిమాని మరింత గ్రాండ్ గా తీయాలని జక్కన్న.. కొద్దిగా ఎక్కువ టైం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట చేస్తున్నాడు. ఏదైనా వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయ్ ఉన్నాడు ఆ తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!