NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: జీ20 సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీ కాబోతున్న రామ్ చరణ్..!!

Share

Ram Charan: “RRR” తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. చెర్రీతో సినిమాలు చేయటానికి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సైతం ప్రయత్నాలు చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ రామ్ చరణ్ కి క్రియేట్ అయింది. పైగా “RRR” కి ఆస్కార్ అవార్డు రావడంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు కవసం చేసుకోవడంతో చాలా సందర్భాలలో అంతర్జాతీయ మీడియాకు చరణ్ ఇంటర్వ్యూలు ఇవ్వటం జరిగింది. సినిమాలో తారక్ నటించిన గాని… ఎక్కువ మీడియా ఫోకస్ మరియు అంతర్జాతీయ మార్కెట్ పరంగా చరణ్ పేరు ప్రతిధ్వనించింది.

Ram Charan is going to meet international representatives at the G20 summit

అంతలా రామ్ చరణ్ కి విపరీతమైన ఆదరణ “RRR” ద్వారా ఏర్పడింది. “RRR” ఆస్కార్ గెలిచిన సమయంలో దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు చాలామంది సినిమా యూనిట్ నీ ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా … చరణ్ నీ సత్కరించడం జరిగింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ అంతర్జాతీయ ప్రతినిధులతో ఫిలిం టూరిజం చర్చలలో జీ20 సదస్సులో పాల్గొన్న పోతున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగబోయే ఈ సదస్సులో.. టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ లో చరణ్ అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశం అవుతారు.

Ram Charan is going to meet international representatives at the G20 summit

సాయుధ దళాల సెక్యూరిటీ మధ్య ఈ మీట్ అటహాసంగా ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి వచ్చిన సెలబ్రిటీలు ఈ సమావేశంలో ఫిలిం టూరిజం… ఏకో ఫ్రెండ్లీ టూరిజం పై చర్చించనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో అందుబాటులో ఉన్న అవకాశాలు మరియు ప్రోత్సాహకాలపై చర్చ జరగనుందని అధికారులు తెలియజేయడం జరిగింది. ఇంకా ఇదే సమావేశానికి ధర్మం, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్… శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నరు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Share

Related posts

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న విక్ర‌మ్ `కోబ్రా`.. ఇదిగో స్ట్రీమింగ్ డేట్‌!

kavya N

Unstoppable 2: ‘అన్ స్టాపబుల్ 2’ నాలుగో ఎపిసోడ్ లో లెజెండరీ డైరెక్టర్లు & నిర్మాతలు..!!

sekhar

Naga Chaitanya: అదిరా నాగ చైతన్య అంటే.. బంగారం రా మా వాడు.. సమంత మీద సీరియస్ అవుతోన్న అక్కినేని ఫ్యాన్స్..!

Ram