Oscars 2023: “RRR” సినిమా పుణ్యమా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకప్పుడు ఈ హీరోల అభిమానులు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించేవాళ్లు. అయితే ఈ సినిమాతో మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ మధ్య చాలా ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో తారక్ కీ ఏదైనా అన్యాయం జరుగుతున్న గాని మెగా ఫాన్స్ మద్దతుగా నిలబడటం విశేషం. అంతేకాదు చరణ్ తన తండ్రి కాబోతున్న విషయాన్ని మొట్టమొదటిసారిగా తారక్ తోనే పంచుకోవడం జరిగింది. అంతగా ఇద్దరు మధ్య బాండింగ్ క్రియేట్ అయింది.
ఈ క్రమంలో నిన్న అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లో.. ప్రపంచ వేదికపై చరణ్, ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఆస్కార్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సమయంలో సోషల్ మీడియాలో మోస్ట్ మెన్షన్డ్ స్టార్స్ గా నిలిచారు. ఆస్కార్ అవార్డులలో 1) ఎన్టీఆర్ 2) రామ్ చరణ్ 3) కే హుయ్ క్వాన్ 4) బ్రాండెన్ ప్రెజర్ 5)పెడ్రో పాస్కలల్ పేర్లను ఎక్కువగా ప్రస్తావించారు. ఇంకా గోల్డెన్ గ్లోబ్ లో చరణ్, ఎన్టీఆర్ టాప్ 2లో ఉన్నారు. “RRR” సినిమాకీ ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ల పేర్లు మారుమ్రుగుతున్నాయి.
ఇక ఇదే సమయంలో హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు కూడా వస్తున్నాయి. “అవతార్” వంటి సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళితో పనిచేయడానికి రెడీగా ఉన్నట్లు ఓపెన్ గానే చెప్పడం జరిగింది. “RRR” భారతీయ చలనచిత్ర రంగం యొక్క రూపురేఖలు మార్చేసింది. ఈ సినిమా ద్వారా చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు హాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఇద్దరికీ భారీ ఎత్తున హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.