Ram Charan: రామ్ చరణ్ Ram Charan మెగా ఫ్యాన్స్ ను మెచ్చుకున్నాడు. అభినందిస్తూ వాయిస్ మెసేజ్ ఇచ్చాడు. ఫ్యాన్స్ చేస్తున్న సేవల వీడియో క్లిప్పింగ్స్ జోడించాడు. ఇలా ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కరోనా సమయంలో ఆక్సిజన్ అవసరమైన వారికి.. అభిమానులు ఎంత దూరమైనా వెళ్లి ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తున్నారు. తాము ఇచ్చిన ఒక్క పిలుపుకు స్పందించి ఫ్యాన్స్ ఇలా కదలడం వారికీ అమితానందం ఇస్తోంది. ఇప్పటికే చిరంజీవి వాయిస్ మెసేజ్ తో గతంలోనే అభినందించగా ఇప్పుడు రామ్ చరణ్ కూడా అభిమానుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ వీడియో రూపొందించారు.

‘అభిమానులు ఈ కోవిడ్-19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సామాన్యులకు సహాయం చేయడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వరకూ మీరు ఎంతో అంకితభావంతో పని చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎందరికో సహాయం చేసిన మీకందరికీ నా శుభాభివందనాలు. మీ అందరి అంకితభావానికి నా ధన్యవాదాలు’ అని అన్నారు. ఈమేరకు ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యాక్రమాలు, ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీ.. చిత్రాలను వీడియో రూపంలో మలచి తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు.
Read More:Chiranjeevi Oxygen Banks: మీడియా తీరుపై చిరంజీవి నిర్వేదం..! మీడియా అధినేతతో ఫోన్ సంభాషణ..!
ఇప్పటికే చిరంజీవి చారిటీ ద్వారా సాయం అందుకున్న ఎంతోమంది చిరంజీవి-రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన ప్రకంపనలు తెలిసిందే. వైరస్ ఫస్ట వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక మరణాలూ ఎక్కువగా సంభవించాయి. దీంతో స్పందించిన చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో తనవంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆక్సిజన్ బ్యాంకులు పెడుతున్నట్టు ప్రకటించిన వారం రోజుల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన వారికి ఉచితంగా సిలిండరల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులనే ఇంచార్జిలుగా పెట్టారు. దీంతో చిరంజీవి-రామ్ చరణ్ చేస్తున్న సేవ ఎందరో బాధితులకు ఆసరగాగా మారింది.