హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మాలీవుడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ టైటిల్ రోల్స్‌లో నటించగా.. రష్మిక మందన్న ఒక కీ రోల్లో మెరిసింది. ఈ మూవీ విజయం సాధించిన సందర్భంగా రష్మిక తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సమయంలో మీడియా మిత్రులు ఆమెను సీతారామం సినిమా గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. అందుకు ఆమె ఆసక్తికర సమాధానాలు చెప్పింది.
అఫ్రిన్ పాత్రపై ఇంటరెస్టింగ్ కామెంట్స్
అఫ్రిన్ పాత్రకు ఊహించని రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీనికి మీరు ఎలా ఫీలౌతున్నారు? అని మీడియా వారు రష్మికాని ప్రశ్నించారు. దీనికి ఈ ముద్దుగుమ్మ సమాధానమిస్తూ.. ఈ మూవీ కోసం రెండేళ్లు పాటు మూవీ టీమ్ కష్టపడింది. వారి కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది. అఫ్రీన్ పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌కు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. అఫ్రిన్ క్యారెక్టర్ మీకు ఛాలెంజింగ్ గా అనిపించిందా? అని అడగ్గా.. “అవును, అఫ్రీన్ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇలాంటి పాత్రలు చేసినప్పుడే కొత్తగా అనిపిస్తుంది.” అని బదులిచ్చింది.
స్టోరీ వినగానే ఓకే చెప్పా
అలానే సీతారామం కథ విన్నప్పుడు తనకు ఎలా అనిపించిందో కూడా చెప్పింది. “సీతారామం స్టోరీ నాకు చెప్పినప్పుడు చాలా కొత్తగా, ఫ్రెష్‌గా, ఆసక్తికరంగా అనిపించింది. అందుకే ఆ స్టోరీని వినగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేసాను. ఈ కథ ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నిటికీ చాలా విభిన్నమైనది. అందుకే హీరోయిన్ రోల్ కాకపోయినా ఓకే చెప్పాను. నేను నా కెరీర్ స్టార్ట్ అయిన సమయం నుంచి అన్ని హీరోయిన్ రోల్స్‌లోనే నటించాను. అందుకే నాకు ఈ చిత్రంలోని అఫ్రీన్ రోల్ చాలా కొత్త అనుభూతిని అందించింది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో భవిష్యత్ లో కూడా నటిస్తాను.” అని రష్మిక తెలిపింది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!