ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు. ఈ సందర్భంగా శేఖర్ కపూర్ తమ సోషల్ మీడియాలో రాజమౌళి మరియు ఆయన కుటుంబం పై పొగడ్తల వర్షం కురిపించారు. డైరెక్టర్ రాజమౌళి నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. ఒక రోజంతా వారి కుటుంబంతో గడుపుటం ఎంత అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. “గోల్డెన్ బాయ్ ఆఫ్ సినిమాతో” ఫిలిం మేకింగ్, కథలు, టెక్నాలజీ, ఫిలాసఫీ గురించి చర్చించినట్లు సోషల్ మీడియాలో శేఖర్ కపూర్ తెలియజేయడం జరిగింది.
దీంతో రాజమౌళి స్పందించి.. “మీకు ఆతిథ్యం ఇవ్వటం మాకు గౌరవం. మీ నుంచి కొంచెం ధైర్యం వస్తుందని ఆశిస్తున్నాను..అని రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో శేఖర్ కపూర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శకుడు రాజమౌళి తీసిన “బాహుబలి”, “RRR” రెండు కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి పెరిగింది అన్న వార్తలు మొదలయ్యాయి. ఇండియాలోనే అత్యధిక హైయెస్ట్ కలెక్షన్ సాధించే దర్శకుడిగా పేరొందిన రాజమౌళి.. పనితనంపై ప్రపంచ సినీ ప్రేమికులు తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో రాజమౌళితో చేయటానికి బాలీవుడ్ దిగ్గజాలు సైతం ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో రాజమౌళి పై ఫిలిం మేకర్, నటుడు శేఖర్ కపూర్ చేసిన కామెంట్ లు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. “ఆర్ఆర్ఆర్” తర్వాత రాజమౌళి ఇప్పుడు మహేష్ తో సినిమా చేయనున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!