Ravi Teja: రవితేజ Ravi Teja సినిమా పవర్ ఏంటో తన ఎనర్జీ ఏంటో క్రాక్ ద్వారా మరోసారి నిరూపణైంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు పవర్ బూస్ట్ ఇచ్చింది క్రాక్. గోపీచంద్ టేకింగ్ తగ్గట్టు రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపిన స్పీడ్, ఫోర్స్, యాక్షన్, డైలాగ్ డిక్షన్.. సినిమాను సూపర్ హిట్ చేశాయి. ప్రస్తుతం రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత రవితేజ నటించే సినిమా #RT68 అంటూ ఇటివల ఓ అనౌన్స్ మెంట్ వచ్చింది. వరుస అప్డేట్స్ తో ప్రాజెక్టుపై హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడీ సినిమా డిటైల్స్, టైటిల్ తోసహా రివీల్ చేసి అంచనాలు పెంచేశారు.
‘రామారావు.. ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ తో రవితేజ్ 68వ సినిమా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాతో శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మార్వోగా నిజాయితీ ఉన్న అధికారిగా తన పాత్ర ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్డేట్స్ లో రవితేజ రెండు చేతులతో సంతకాలు చేస్తున్న స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కొత్తగా రిలీజ్ చేసిన స్టిల్ లో రవితేజ హాఫ్ స్లీవ్ షర్ట్, ఫార్మల్ ఫ్యాంట్, గాగుల్స్ తో స్టైలిష్ గా ఉన్నాడు. వెనుక ప్రభుత్వ వాహనం.. వృత్తిలో నిబద్ధతగా ఉంటానంటే చేసిన ప్రమాణ పత్రం, మేజిస్ట్రేట్ కార్యాలయం బోర్డు పోస్టర్ లో కనిపిస్తున్నాయి.
Read More: RRR: ఊపిరిబిగపట్టే అప్డేట్ ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’..! ఆరోజున..
చూస్తుంటే క్రాక్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో రఫ్పాడేసిన రవితేజ.. గవర్నమెంట్ అధికారిగా చాలా కూల్ గా సినిమాను పరిగెట్టించేలా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ లుక్, సినిమా టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మజిలీ సినిమాలో నటించిన దివ్యాంశు కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్టీ టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అందిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!