వర్మ… వినయ విధేయ రామకి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కారణం ఇదే

Share

రేస్ లో గెలవడానికి పందెం కోడిలా సిద్దమవుతున్న చరణ్, వినయ విధేయ రామ ట్రైలర్ తో చిన్న శాంపిల్ చూపించాడు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలని పెంచిన చరణ్-బోయపాటి ఊరమాస్ కి ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 5 మిలియన్స్ దాటిన ఈ ట్రైలర్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. మాములుగా అయితే ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శించే వర్మ నుంచి చాలా తక్కువగా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి కాబట్టి అవి సెన్సేషన్ అవుతుంటాయి. అది కూడా వర్మకి అసలు పడని మెగా ఫ్యామిలీకి కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో అవి మరింత సెన్సేషన్ అయ్యాయి.

వినయ విధేయ రామ ట్రైలర్ చూసి, ట్రైలర్ బాగుందని హిందీలో కూడా రిలీజ్ చేయాలని కోరిన వర్మ… ఇదే చరణ్ ఫస్ట్ హిందీ సినిమా అయితే బాగుండేదని, చరణ్ చాలా బాగున్నాడని తన మార్క్ బాషతో ఒక ట్వీట్ వేశాడు. వర్మ నుంచి మెగా ఫ్యామిలీ హీరో గురించి ఇంత పాజిటివ్ మాట రావడంతో మెగా అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు వర్మ ఇలా ట్వీట్ వెనక ఉద్దేశం నిజంగా ట్రైలర్ నచ్చడమేనా లేక వేరే ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ఒక పెద్ద కారణం కనిపిస్తుంది.

వర్మ, వినయ విధేయ గురించి అంత పాజిటివ్ గా మాట్లాడం వెనకున్న మరో ముఖ్యమైన కారణం… లక్ష్మీస్ ఎన్టీఆర్. అవును వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అడ్డుకొని తీరాలని, బయటకి రాకుండా చూడాలని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రాజకీయంగా అండగా ysrcp ఉండనే ఉంది అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మద్దుతు ఉంటే బాగుంటుందని భావించిన వర్మ, మెగా ఫ్యాన్స్ ని మంచి చేసుకునే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. నిజానికి వర్మ లాంటి మనిషి ఎవరిని లెక్క చేయడు కానీ ఇప్పుడు వర్మ పరిస్థితి అసలు బాగోలేదు, ఆయన తీస్తుంది మాములు సినిమా కాదు కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆడాలి లేకుంటే వర్మ పరిస్థితి పూర్తిగా తలకిందులు అవుతుంది. ఈ విషయం తెలుసుకొనే వర్మ, మెగా ఫ్యాన్స్ ని కూల్ చేస్తున్నాడనిపించకమానదు.


Share

Related posts

కొర‌డాతో కొట్టుకున్న స‌ల్మాన్‌

Siva Prasad

వరుసగా మెగా హీరోలను లైన్ లో పెడుతున్న ఆ టాప్ డైరెక్టర్..!!

sekhar

Review Zombie Reddy : రివ్యూ – జాంబీ రెడ్డి

siddhu

Leave a Comment