NewsOrbit
సినిమా

వర్మ… వినయ విధేయ రామకి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కారణం ఇదే

రేస్ లో గెలవడానికి పందెం కోడిలా సిద్దమవుతున్న చరణ్, వినయ విధేయ రామ ట్రైలర్ తో చిన్న శాంపిల్ చూపించాడు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలని పెంచిన చరణ్-బోయపాటి ఊరమాస్ కి ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 5 మిలియన్స్ దాటిన ఈ ట్రైలర్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. మాములుగా అయితే ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శించే వర్మ నుంచి చాలా తక్కువగా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి కాబట్టి అవి సెన్సేషన్ అవుతుంటాయి. అది కూడా వర్మకి అసలు పడని మెగా ఫ్యామిలీకి కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో అవి మరింత సెన్సేషన్ అయ్యాయి.

వినయ విధేయ రామ ట్రైలర్ చూసి, ట్రైలర్ బాగుందని హిందీలో కూడా రిలీజ్ చేయాలని కోరిన వర్మ… ఇదే చరణ్ ఫస్ట్ హిందీ సినిమా అయితే బాగుండేదని, చరణ్ చాలా బాగున్నాడని తన మార్క్ బాషతో ఒక ట్వీట్ వేశాడు. వర్మ నుంచి మెగా ఫ్యామిలీ హీరో గురించి ఇంత పాజిటివ్ మాట రావడంతో మెగా అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు వర్మ ఇలా ట్వీట్ వెనక ఉద్దేశం నిజంగా ట్రైలర్ నచ్చడమేనా లేక వేరే ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ఒక పెద్ద కారణం కనిపిస్తుంది.

వర్మ, వినయ విధేయ గురించి అంత పాజిటివ్ గా మాట్లాడం వెనకున్న మరో ముఖ్యమైన కారణం… లక్ష్మీస్ ఎన్టీఆర్. అవును వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అడ్డుకొని తీరాలని, బయటకి రాకుండా చూడాలని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రాజకీయంగా అండగా ysrcp ఉండనే ఉంది అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మద్దుతు ఉంటే బాగుంటుందని భావించిన వర్మ, మెగా ఫ్యాన్స్ ని మంచి చేసుకునే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. నిజానికి వర్మ లాంటి మనిషి ఎవరిని లెక్క చేయడు కానీ ఇప్పుడు వర్మ పరిస్థితి అసలు బాగోలేదు, ఆయన తీస్తుంది మాములు సినిమా కాదు కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆడాలి లేకుంటే వర్మ పరిస్థితి పూర్తిగా తలకిందులు అవుతుంది. ఈ విషయం తెలుసుకొనే వర్మ, మెగా ఫ్యాన్స్ ని కూల్ చేస్తున్నాడనిపించకమానదు.

Related posts

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Leave a Comment