రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం `RRR`. ఈ నెలలో మూడో షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది యూనిట్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తుంటే.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రధారిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో వీరితో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ కూడా నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఫిలింనగర్ వర్గాల్లో వినపడుతున్న సమాచారం ప్రకారం సంజయ్ దత్, వరుణ్దావన్లతో రాజమౌళి చర్చలు జరుపుతున్నారట. వీరు కూడా ఓకే చెప్పేస్తే ఇక బాలీవుడ్లో `RRR`కు తిరుగుండదు. మార్కెట్ పరంగా సినిమా మరోసారి బౌండరీలు దాటుతుంది.
ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదిలో పూర్తి చేసి మరో ఆరు నెలలు పాటు గ్రాఫిక్స్ వర్క్ చేసి సినిమాను జూలై 30న విడుదల చేయబోతున్నారు. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రధారిగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రధారిగా కనిపించబోతున్నారు. రెండు రియల్ క్యారెక్టర్స్ ఆధారంగా రూపొందబోయే ఫిక్షనల్ స్టోరి ఇది.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!