25.7 C
Hyderabad
April 1, 2023
NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్..?

Share

NTR 30: “RRR” సినిమా విజయంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన చాలామందిని ఆకట్టుకుంది. గిరిజన ప్రాంతానికి చెందిన నాయకుడి పాత్రలో స్నేహం కోసం… అదేవిధంగా నమ్మిన తెగ కోసం.. ఎంత దూరమైనా ఎవరితోనైనా పోరాడే పాత్రలో ఎన్టీఆర్ నటన అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా “కొమరం భీముడో” సాంగ్ దేశ విదేశీయులను ఎంతగానో అలరించింది. ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ దక్కించుకున్నాడు.

senior hero Srikanth play key roll in koratala NTR's new movie

పైగా ఆస్కార్ బరిలో RRR ఉండటంతో అవార్డు వస్తే మాత్రం ఇంకా తిరుగు ఉండదు. ఇదిలా ఉంటే నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో… ఎన్టీఆర్ తన కెరీర్లో 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించి దాదాపు రెండు సంవత్సరాలయింది. అయితే మధ్యలో కరోనా రావడంతో పరిస్థితులు మారడంతో షూటింగ్ చాలా ఆలస్యంగా మొదలవుతుంది. వాస్తవానికి ఫిబ్రవరి 24వ తారీఖు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనూహ్యంగా నందమూరి తారకరత్న మరణించడంతో వాయిదా వేసుకోవడం జరిగింది. అనంతరం ఇటీవల ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

senior hero Srikanth play key roll in koratala NTR's new movie

కాగా  ఇప్పుడు ఇదే సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల శ్రీకాంత్ విలన్ పాత్రలు చేస్తూ కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు లో పాజిటివ్ క్యారెక్టర్ చేయగా తర్వాత బాలకృష్ణతో అఖండ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించారు. ఇటీవల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ వారసుడు మూవీలో పాజిటివ్ పాత్ర చేయడం జరిగింది. మరి కొరటాల .. ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాలో శ్రీకాంత్ ఏ పాత్రలో కనిపించనున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

పవన్ బర్తడే విషయంలో మహేష్ ఫ్యాన్స్ నీ ఫాలో అవుతున్న పవన్ ఫ్యాన్స్..!!

sekhar

మెగాస్టార్ ఆచార్య లో జాయిన్ కాబోతున్న మరో సూపర్ స్టార్ ..ఇప్పుడు కదా మెగా ఫ్యాన్స్ కి కావల్సిన కిక్ వచ్చేది ..?

GRK

Dethadi Harika: అర‌రే పాపం.. దేత్త‌డి హారిక ఇలా అడ్డంగా దొరికిపోయిందేంటి..?

kavya N