SSMB28: త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అనే విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానేర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 31 న ఈ సినిమా షూటింగ్ ని లాంఛనంగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. తండ్రి పుట్టినరోజున తన సినిమాకు సంబంధించి ఏదో ఒక యాక్టీవిటీ ఉండాలనేది మహేష్ కి నమ్మకం.. అందుకే ఈ ఏడాది ఈ సినిమా ఓపెనింగ్ ప్లాన్ చేశారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మంది అథితులతో ఈ ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి ఏ క్రేజీ అప్డేట్ బయటకు వస్తుంది..
SSMB28: నెగిటివ్ పాత్రకి బాలీవుడ్ నటి..!?
ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే అనుకుంటున్నారు. కానీ త్రివిక్రమ్ సినిమాల్లో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది, అందులో సీనియర్ మాజీ హీరోయిన్లు వస్తుంటారన్న విషయం తెలిసిందే. నదియా (అత్తారింటికి దారేది).., టబు (అల వైకుంఠపురంలో).. స్నేహ (సన్నాఫ్ సత్యమూర్తి).., ఖుష్బూ (అజ్ఞాతవాసి).. ఇలా చాల మందినే దించారు. ఇక ఈ మహేష్ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టిని సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబుతో పొసగని ఓ నెగిటివ్ పాత్ర కోసం ఆమెను అనుకుంటున్నారట. చేపకల్ల సుందరిగా శిల్పాశెట్టి తెలుగులో సుపరిచితమే. సాహసవీరుడు సాగరకన్య, ఆజాద్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఈమె చాల కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ యోగా ద్వారా సోషల్ మీడియాలో దగ్గరగా ఉంటున్నారు. ఈ సినిమాలో ఆమె నటిస్తే క్రేజీ కాంబో అవుతుంది..! ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారువారి పాట” లో నటిస్తున్నారు. ఆ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!