NewsOrbit
Entertainment News సినిమా

Tammareddy Bharadwaj: ఆ టైంలో మహేష్ ని ఎవరు సపోర్ట్ చేయలేదు తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్..!!

Share

Tammareddy Bharadwaj: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో పెద్దగా ఎవరిని కలవరనా సంగతి తెలిసిందే. ఎక్కువగా తన పని తాను చేసుకునే వెళ్ళిపోతారు. కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్… తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్..స్టార్ డామ్ సంపాదించుకుని తనకంటూ సెపరేట్ గుర్తింపు పొందారు. తెలుగు చలనచిత్ర రంగంలో మహేష్ ఓపెనింగ్స్ రాబట్టడంలో దిట్ట. ఇదిలా ఉంటే 2004వ సంవత్సరంలో గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ అర్జున్ అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాని మహేష్ అన్నయ్య రమేష్ బాబు నిర్మించారు. అయితే ఈ సినిమా అప్పుడు పైరసీకి గురి కావటం తెలిసిందే.

Tammareddy Bharadwaj's shocking comments who did not support Mahesh at that time

అయితే ఈ పైరసీకి సంబంధించి వరంగల్ షాపులో సీడీలు అమ్ముతున్న వ్యక్తితో వివాదం నెలకొంది. పైరసీ ముఠాని పట్టుకుంటే.. పోలీసులు మహేష్ బాబుని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మహేష్ బాబు పైరసీని ప్రోత్సహించే ముఠాలకు వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్ వద్ద ధర్నాకు దిగటం జరిగింది. మహేష్ బాబుకి ఏ హీరో సపోర్ట్ చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా షాకింగ్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.. ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో చిన్నవాడైన పెద్దవాడైనా కలుపుకొని పోవాలి. కానీ తెలుగు చలనచిత్ర రంగంలో ఐక్యత లేదు.

Tammareddy Bharadwaj's shocking comments who did not support Mahesh at that time

పైరసీ పై మహేష్.. పోరాటం చేస్తున్న సమయంలో ఎవరు మద్దతు ఇవ్వలేదు. మహేష్ వ‌చ్చి చాంబ‌ర్‌లో కూర్చున్నాడు. ప‌వ‌న్ మాత్రం ఐ యామ్ విత్ యు అని అన్నార‌ని తెలిసింది. కానీ, నేను చాంబ‌ర్‌కి వ‌చ్చేస‌రికి మ‌హేష్ ఒక్కడే ఉన్నాడు. మహేష్ తో క‌లిసి మాట్లాడాను. కానీ, ఆ సమయంలో ఏ హీరో ముందుకు రాలేదు. ఇప్పుడు మహేష్ ఎవరిని కలవడం లేదు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.. అంటూ తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు రీసెంట్ ఇంటర్వ్యూలో చేయడం జరిగింది. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.


Share

Related posts

Bommu Lakshmi Saree Pics

Gallery Desk

స్కామ్‌…  అడ్డంగా బుక్క‌య్యారు

Siva Prasad

మ‌హేష్ గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా.. ఏం చేశాడో తెలుసా?

kavya N