సినిమా

SVP: “సర్కారు వారి పాట” కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!!

Share

SVP: తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద సినిమాలకు చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ ధరలకు సంబంధించి ఇంకా బెనిఫిట్ షో లకు సంబంధించి ఇప్పటికే చాలా సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. RRR, ఆచార్య సినిమాలకు టికెట్ ధరలు పెంచటం మాత్రమే కాదు ఐదు షోలకు అనుమతిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు “సర్కారు వారి పాట” కి కూడా.. టికెట్ ధరలు పెంచుకునే దిశగా అనుమతులు ఇవ్వడం జరిగింది.

Telangana governament increases ticket price of Mahesh svp

ఈ సినిమా మే 12వ తారీకు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా థియేటర్ లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో నైజాం లో.. ఆన్ లైన్ టికెట్ లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కొద్ది సమయంలోనే టిక్కెట్లు అయిపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. “సర్కారు వారి పాట” ట్రైలర్ మరియు పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడంతో… పాటు మహేష్ సినిమాలో చాలా కొత్తగా ఉండటంతో.. అంచనాలు ఉన్న కొద్ది పెరిగిపోతున్నాయి.

ఇక ఇదే సమయంలో మహేష్ బాబు సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇంటర్వ్యూ ఇస్తూ అనేక విషయాలు తెలియజేస్తూ.. గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ సినిమా అని చాలా ధీమాగా ఉన్నారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్కారు వారి పాట టికెట్ ధరలు పెంచుకునే వీలు కల్పించింది. మరి “సర్కారీ వారి పాట” రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.


Share

Related posts

నన్ను పెళ్ళి చేసుకోవాలనుకునే ఏ మగాడైనా రావచ్చు నేను రెడీ..!

GRK

భూ విరాళం ఎవ‌రికో తెలుసా!

Siva Prasad

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ ప్రాజెక్ట్ డేరింగ్ డైరెక్టర్ ఫిక్స్..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar