Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి కం బ్యాక్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజయాలు అందిస్తూ ఉన్నాడు. “వకీల్ సాబ్”, బీమ్లా నాయక్…లతో విజయాలు అందుకున్న పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే చరిత్రాత్మక నేపద్యం కలిగిన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. “ఖుషి” నిర్మాత ఏ.ఏం.రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నాడు. కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొగలు సామ్రాజ్యం కాలం నాటి కథతో… దేశ చరిత్రకు ముడిపడిన ఒక వాస్తవమైన సంఘటనతో క్రిష్ ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాలో ఒకటి దొంగ పాత్ర మరొకటి ప్రజలకు నాయకుడి పాత్రతో పాటు మరో డిఫరెంట్ క్యారెక్టర్ పవన్ ఈ సినిమాలో చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పోరాట సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్.. పురాతన కాలం నాటి యుద్ధవిద్యలు ప్రత్యేకంగా నేర్చుకోవడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమాలో యుద్ధ సన్నివేశాలు ముఖ్యంగా గుర్రపుస్వారీతో చేజింగ్ సన్నివేశాలు చాలా హైలెట్ గా క్రిష్ తెరకెక్కించినట్లు టాక్ నడుస్తోంది. దొంగగా పవన్ నటించే పాత్ర సినిమాకి హైలెట్ అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగానే కంప్లీట్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ “భగత్ సింగ్ బావధీయుడు” ఆ తర్వాత.. మరో మలయాళం రీమేక్ సినిమా పవన్ చేయనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!