Subscribe for notification
Categories: సినిమా

Virata Parvam: `విరాట‌ప‌ర్వం`లో రానా హీరో కాదా.. అస‌లా వీడియోకు అర్థ‌మేంటి?

Share

Virata Parvam: రానా ద‌గ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `విరాట‌ప‌ర్వం`. ఇందులో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప్రియమణి, నివేదా పేతురాజ్‌, నవీన్‌ చంద్ర త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

ఉత్త‌ర తెలంగాణ‌లో 1990లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను షురూ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అదేంటంటే.. విరాట‌ప‌ర్వంలో రానా హీరోనే కాదు.. సాయిపల్లవి పాత్ర ప్రధానంగానే సినిమా సాగుతుందని టాక్ మొద‌లైంది. ఇందుకు కారణం చిత్ర టీమ్ బ‌య‌ట‌కు వ‌దిలిన ఓ ప్రమోషన్‌ వీడియోనే. ఆ వీడియోలో ఓ యూట్యూబ‌ర్, రానాని వెతుక్కుంటూ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కి వెళ్లాడు. తాను సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్ అని ప‌రిచ‌యం చేసుకుని, `మా సాయి ప‌ల్ల‌వి ఎప్పుడొస్తుంది? ట్రైల‌ర్ ఎప్పుడు? అసలు ఈసారైనా సినిమాను విడుదల చేస్తారా లేదా` అని ప్ర‌శ్న‌లు సంధిస్తాడు.

అందుకు రానా `నేను కూడా సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్‌నే.. ఈ సినిమాని సాయి ప‌ల్ల‌వి కోస‌మే తీశాం రా బాబూ` అని చెప్పడంతో.. ఈ వీడియో కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. `విరాటపర్వం`ను సాయిపల్లవి సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌విదే ప్ర‌ధాన పాత్ర అని, రానాది కాద‌నే ప్ర‌చారాలు ఊపందుకున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. కాగా, విరాట‌ప‌ర్వం థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు క‌ర్నూల్‌లో లాంచ్ చేయ‌బోతున్నారు.

https://www.instagram.com/p/CeXtF2lDn8A/?utm_source=ig_web_copy_link


Share
kavya N

Recent Posts

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

15 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago