దైవం

Sahasranamalu : సహస్ర నామాలు చదివేంత సమయం ఉండడం లేదని బాధ పడేవారు ఇలా చేసిన అద్భుత ఫలితం ఉంటుంది !!

Share

Sahasranamalu :  ప్రతి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. మహా విష్ణు  సర్వోపగతుడు….   ఎక్కడ వెదికితే అక్కడ ఉంటాడు… ఆ దేవాది దేవుడినుండే  దేవతలందరు సాక్షాత్కారిస్తుంటారు. కాబట్టి ప్రతి నిత్యం విష్ణు నామ పారాయణం జపం  చేసుకుంటే ,జీవితంలో ఉన్నత స్థానానికి  ఎదుగుతారు . అదృష్ఠం  కలిగి రాజ యోగం   పడుతుంది.
సహస్ర నామ ప్రయాణం తో  పితృ దోషాలు  తొలగుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి   లభించి    దారిద్ర ఇతి బాధల నుండి విముక్తి కలుగుతుంది.


శ్రీ మహా విష్ణు ఆరాధన జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి అని చెప్పవచ్చు.   ప్రతి రోజు  బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం  చేసేవారి   సంకల్పం నెరవేరడం తో పాటు  మానసిక సమస్యలు తగ్గి   మనస్సు దృఢమవుతుంది.
సహస్ర నామం ప్రతి నిత్య పారాయణం చేసేవారికి  వారికి రక్షణ కవచంగా  సుదర్శన శక్తి  పొందగలుగుతారు.మనసులో  ఉన్న చెడు ఆలోచనలు  పోయి అంత: శతృవులు   తొలగుతాయి.
విష్ణు సహస్ర నామ పారాయణం  చేయడం వలన   నవ గ్రహ దోషాలు తొలగి, వాక్ శుద్ధి  కలుగుతుంది. జ్ఞానం వృద్ది   చెంది తద్వారా దేవుని సాక్షాత్కారం   కలిగి జీవిత సత్యాన్ని  తెలిసేలా చేస్తుంది.

అబ్బో మాకు టైం ఎక్కడ ఉంటుంది అని అనకండి. మీరు మీ పనులు చేసుకుంటూనే ఈ సహస్రనామాలు వినవచ్చు మననం చేసుకోవచ్చు. అంతే కాదు ప్రతి ఒక్కరికి ఇష్ట దైవం ఉంటుంది. ఇష్టమైన నామం ఉంటుంది. కాబట్టి మీ రోజు వారి పనులు చేసుకుంటూనే నమ స్మరణ చేసుకోవడం అలవాటు  చేసుకోండి. మొదట కాస్త కష్టం గా అనిపించవచ్చు . కానీ రాను రాను ఆ నామం మీ శ్వాసతీసుకోవడం తో పాటుగా జరిగిపోతుంది. అలా చేసే స్మరణ మిమ్మల్ని ఎన్నో సమస్యలనుండి బయట పడేసి మనశాంతిని ,శ్రేయస్సును కలిగిస్తుంది.


Share

Related posts

Today Horoscope: ఏప్రిల్ 18 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Radhasaptami : రథ సప్తమి రోజు మగవారు  జిల్లేడు ఆకులు తలమీద పెట్టుకుంటే, ఆడవారు మాత్రం ఈ ఆకులను తలమీద పెట్టుకుని స్నానం చేయాలి !!

siddhu

Today Horoscope: సెప్టెంబర్ 28 – బాద్రపదమాసం -రోజువారీ రాశి ఫలాలు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar