శరత్కాలం.. అంటేనే ప్రత్యేకమైన వెన్నల అందాలకు ప్రతీక. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణానికి ఈ శరత్కాలం పేరుగాంచింది. అయితే అక్టోబర్ 31న పౌర్ణమి. ఈరోజు బ్లూమూన్ డే. ఆ విశేషాలు తెలుసుకుందాం…
విజ్ఞాన శాస్త్రం ప్రకారం బ్లూ మూన్ అనేది ఓ ఖగోళ దృగ్విషయం. ప్రతి 2 నుంచి 3 ఏళ్లకు ఓ సారి కనిపిస్తుంది. ఈ రోజు బ్లూ మూనే డే. తిరిగి ఇలాంటి దృశ్యం 2029లో మాత్రమే కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ ఏడాది బ్లూ మూన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని పండితులు ఇటు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాసా తీసిన మునుపటి చిత్రాల ప్రకారం చంద్రుడు పసుపు లేదా తెలుపు రంగులో కనిపిస్తాడు. కానీ ఈ సారి మాత్రం చంద్రుడు స్వరూపం తేలికపాటి రంగులో ఆకాశం రంగులో కలిసినట్లు సంకేతాలు ఉన్నాయి.
నెలలో రెండు పున్నాలు…
సనాతన ధర్మ జ్యోతిషశాస్త్రం ప్రకారం పంచాంగంలో పౌర్ణమి, అమవాస్య రెండూ ఒకే నెలలో అంటే ఒకే మాసంలో వస్తాయి. ఇదే సమయంలో ఏడాదిలో 2, 3 సంవత్సరాల్లో కొన్నిసార్లు నెలలో రెండు పౌర్ణమిలు ఉంటాయి. అంతేకాకుండా 2020 అక్టోబరులో కూడా ఇదే జరిగింది. ఈ నెల మొదటి తేదీన ఓ పౌర్ణమి వచ్చింది. అంతేకాకుండా అక్టోబరు 31న రెండో పౌర్ణమి వచ్చింది. ఈ విధంగా వచ్చినపుడు రెండో పౌర్ణమిలో బ్లూ మూన్ అని పిలుస్తుంటారు.
శరత్కాల పౌర్ణమి అక్టోబరు 31న.
హాలోవీస్ పండుగ నేడే !
ఈ రోజు క్రైస్తవుల హాలోవీన్ పండగ కూడా ఉంది. క్రైస్తవ మతస్థులు ఈ పండుగను ఓ ప్రత్యేకంగా పరిగణిగస్తారు. ఈ రోజును ఆత్మలు చురుకుగా మారి ప్రజలను కలవరపెడతాయని ఓ నమ్మకం ఉంది. ఆత్మలను నివారించడానికి ప్రజలు దెయ్యాల దుస్తులను ధరించి, భయానక ముఖాలతో తిరుగుతారు. దీనిద్వారా ప్రజల్లో భయం పోతుందని పెద్దలు చెప్తున్నరు.