Sravana Sukravaram 2023: చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం నుండి లెక్కిస్తే శ్రావణమాసం ఐదవ మాసం అవుతుంది . పౌర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా అయిన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు విశేషముగా పుణ్య ఫలములను ఇస్తాయని పెద్దలు చెబుతారు.

శ్రావణమాసం మహిళలకు ఏంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడంవల్ల దీనిని వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని శుభాలను ప్రసాదించే మాసమని కూడా శాస్త్రం చెబుతోంది.
శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలు చేసినంత పుణ్యమని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పూజలో పాలుపంచుకుంటారు. శ్రీ వర లక్ష్మి దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, చదువు , ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉన్నది. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది భాగ్యాలన్నీ లభిస్తాయి. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి. భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు.

Varalakshmi Pooja Vidhanam : వరలక్ష్మి వ్రత పూజ విధానము 2023
నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా వుందురు. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది. శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించిన వారికి ఆన్ని శ్రేష్ఠమైన విజయాలు వరిస్తాయని విశ్వాసం.

Varalakshmi Vratham Pooja | Devotional: వ్రతం చేసుకునే రోజున ఉదయాన్నే లేచి తలా స్నానం చేసి క్రొత్త దుస్తులు ధరించి పూజ చేసుకుంటారు . ముఖ్యం గా స్త్రీలు చేతికి తోరము లను కట్టుకుంటారు. అమ్మవారిని కొంతమంది కొబ్బరికాయ మీద కనులు ముక్కు చేసి చక్కగా నగలతోను పూలతోను అలంకరిస్తారు. కొందరు పాలవిల్లి కూడా కట్టే సంప్రదాయం ఉంది. ఆ రోజున అమ్మవారికి 9 గాని 11 గాని నైవేద్యాలు చేస్తారు. చేయలేకపోతే కనీసం మూడు అయినా చేసి నివేదిస్తారు. ముత్తైదువులకు బూరెల వాయనం ఇచ్చిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు.
కొత్తగా కొనుకున్న నగలు, చీరలు అమ్మవారివద్ద ఉంచి నమస్కరిస్తారు. సాయంత్రం ఇరుగు పొరుగు స్త్రీలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ వ్రతం ఏంటో ప్రాముఖ్యత కల్గినది.
లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే శుభములను చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అందరిళ్ళల్లోనూ శనగలు , పిండివంటలూను.
అందరినీ వరలక్ష్మి తల్లి కాపాడును గాక.