AP Employees: బాబుకి దెబ్బేశారు..! జగన్ కి వేస్తారా..? పీఆర్సీ ఇచ్చినా రాజకీయ రగడ..!!

Share

AP Employees: ఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్ట మొదటి సారిగా ఉద్యోగులు రోడ్డు ఎక్కడానికి సిద్దపడ్డారు. దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల పాటు ఓపిక పట్టినా వారి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పూర్తి స్థాయిలో ధర్నాలు, ఆందోళనలకు అయితే దిగడం లేదు కానీ ఉద్యమ కార్యచరణకు సిద్ధపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ప్లానింగ్, ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక వరాన్ని అయితే ఇచ్చేశారు. ఉద్యోగ సంఘాల అనేక డిమాండ్ లలో ఒకటైన పీఆర్సీ పది రోజుల్లో అమలు చేస్తామని సీఎం జగన్ నేడు ప్రకటించారు. ఇందులోనూ రాజకీయ కోణం ఉంది. సీఎం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో ఉద్యోగులను సంతృప్తి పరిచేది కాదు. పీఆర్సీ ప్రకటించినప్పటికీ ప్రభుత్వంపై ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకిత పోదనే మాట వినబడుతోంది. ఇప్పుడు పీఆర్సీ ఇచ్చిన పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. వాస్తవానికి పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ అధికారిక ప్రకటన చేయలేదు. చిత్తూరు జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తుండగా అక్కడ కొందరు ఉద్యోగులు పీఆర్సీ కావాలి అంటూ నినాదాలు చేస్తుండగా, వాళ్లను పిలిచి పది రోజుల్లో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన అధికారికంగా కాకపోయినా సీఎంగా ప్రకటించిన పది పదిహేను రోజుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగం పీఆర్సీ పై అధికారిక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెలలో పీఆర్సీ ఇవ్వడం అనేది ఖాయంగా కనబడుతోంది. దీన్ని క్రిస్మస్ కానుకగా ఇచ్చే అవకాశం ఉంది.

AP Employees to launch agitation over demands
AP Employees to launch agitation over demands

 

AP Employees: సీపీఎస్ రద్దు, డీఏలపై ఉద్యోగ సంఘాల పట్టు

అసలు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ సీపీఎస్ రద్దుకు పట్టుబడుతున్నారు. ఇది రద్దు చేయకపోతే ఉద్యోగులు నష్టపోతారు. సీపీఎస్ రద్దు చేయడం ప్రభుత్వానికి అంత సులువు కాదు. దీనిలో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానితో పాటు ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. 2019 జూలై, 2020 జనవరి, జూలై, 2021 జనవరి, జూలై ఇలా ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. వీటికి తోడు పెండింగ్ చెల్లింపులు ఉన్నాయి. ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం. కానీ ప్రభుత్వం వద్ద ప్రస్తుతం అంత ఆర్ధిక పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక ఇబ్బందుల్లో పెద్ద మొత్తంలో ఉద్యోగులకు డీఏలు, పాత బకాయిలు చెల్లింపులు కష్టసాధ్యమేనని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటవ తేదీ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లింపులు చేయడమే కష్టం. కానీ ఈ నెల 1వ తేదీనే జీతాల చెల్లింపు జరిగింది. ఈ నెల మాత్రం ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కాలేదు. ఉద్యోగుల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రభుత్వం అర్ధం చేసుకున్నట్లుగానే కనబడుతోంది. గతంలో టీడీపీ హయాంలో ఉద్యోగులు ఆందోళన చేయనున్నారని తెలియడంతోనే వెంటనే వాళ్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది. 2014 నుండి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లు పరిపాలన ఆత్మరక్షణ ధోరణితో సాగింది. ఎవరికి వ్యతిరేకంగా వెళ్లలేదు. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లే ప్రయత్నమే చేశారు.

చంద్రబాబుకు దెబ్బేశారు

ఉద్యోగులు అడిగినవన్నీ ఇచ్చారు. ఫిట్ మెంట్ ఇచ్చారు. రిటైర్మెంట్ వయసు పెంచారు. డీఏలు పెండింగ్ లో పెట్టలేదు. జీతాలు కూడా ఒకటి రెండు సందర్భాలలో రెండు మూడు రోజులు ఆలస్యం అయ్యేవి కానీ ఎక్కువ రోజులు ఆలస్యం అవ్వలేదు. సచివాలయ ఉద్యోగులకు రెండు వీక్ ఆఫ్ లు ఇచ్చారు. ఉద్యోగులు అడిగిన వన్నీ చంద్రబాబు హయాంలో ఇచ్చినా గానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు దెబ్బేశారు. జగన్మోహనరెడ్డికి ఓట్లు వేశారు. ఇప్పుడు ఉద్యోగులు రాజకీయంగా గెలుపు ఓటముల్లో ఎంత ప్రభావం చూపుతారు అనేది జగన్ కు, వైసీపీకి బాగా తెలుసు. కానీ వాళ్లు అడిగిన వన్నీ ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కడానికి సిద్ధం కావడంతో పీఆర్సీపై ప్రకటన చేశారు. కానీ సీపీఎస్ రద్దు చేయాలి,. డీఏలు ఇవ్వాలి, ఏరియల్స్ ఇవ్వాని. బదిలీలు, కారుణ్య నియామకాలు వంటి దాదాపు 45 డిమాండ్లు ఉన్నాయి. అవి అన్నీ నెరవేర్చలేరు కానీ వీటిలో అయిదు డిమాండ్ లను నెరవేర్చినా ఉద్యోగ సంఘాలు మెత్తబడే అవకాశం ఉంది. మొత్తం డిమాండ్ లు నెరవేర్చే ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రానికి లేదనేది అందరికీ తెలిసిందే. చూడాలి ఏమి జరుగుతుందో.


Share

Related posts

Aacharya: సిద్ద వచ్చాడు…అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళాడు

GRK

అందరి గేమ్ ఆడేస్తున్న అభిజిత్..!!

sekhar

పూజా హెగ్డే కి త్రివిక్రం అంటే అందుకే ప్రత్యేకం.. ఎక్కడున్నా ఒక్క కాల్ తో వాలిపోతుందట ..?

GRK