NewsOrbit
5th ఎస్టేట్ Featured రాజ‌కీయాలు

జగన్ X నిమ్మగడ్డ గెలుపు వెనుక “తప్పెవరిది..!? స్కెచ్ ఎవరిది”..!?

Andhra Pradesh Politics రాజకీయంలో.. ప్రజా జీవితంలో.. పాలనలో.. అధికారిగా ఉన్నత హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడూ గెలుపు దక్కదు..! అత్యున్నత స్థాయికి వెళ్లిన తర్వాత గెలవాలన్నా.., ఓడాలన్నా.. కొన్ని మెదడులు పని చేయాలి. కొన్ని స్కెచ్చులు వేయాలి. కొన్ని తప్పొప్పులు జరగాలి. ఎవరి మెదడు చురుకుగా పని చేసి, ఎవరి స్కెచ్ వర్కవుట్ అయితే వారు గెలుస్తారు.., ఎవరి తప్పు అడుగు ఫలితం ఎక్కువగా చూపిస్తుందో వారు ఓడిపోతారు..! ఇక్కడ ఏపీలో YS Jagan Mohan Reddy జగన్ X నిమ్మగడ్డ రమేష్ కుమార్ Nimmagadda Ramesh Kumar వివాదంలో కొన్ని ఎత్తులు “కమ్మ”గా నడిపిస్తే.., YSRCP Government ప్రభుత్వ పరంగా కొన్ని తప్పుడు అడుగులు నిమ్మగడ్డకి SEC Nimmagadda వరంగా మారాయి.

cinematic twists between jagan and nimmagadda ramesh kumar
cinematic twists between jagan and nimmagadda ramesh kumar

సీఎం బృందానికి ముందుచూపు ఉన్నట్టా..? లేనట్టా..!?

రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థకి.., ప్రతి అత్యున్నత హోదాకి కొన్ని హక్కులు, అధికారాలు ఉన్నాయి. అలాగే సీఎం జగన్ కి.. అతని చేతిలో ఉన్న శాసన వ్యవస్థకి… ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి.. అతని చేతిలో ఉన్న ఎన్నికల కమీషన్ కి హక్కులు, అధికారాలు ఉన్నాయి. ఎన్నికల కమీషన్ నిర్ణయాలను ఎదుర్కోవాలి, నిమ్మగడ్డ నిర్ణయాన్ని సవాల్ చేయాలి అంటే ప్రభుత్వం దగ్గర కచ్చితంగా కొన్ని ప్రణాళికలు, కచ్చితమైన ముందుచూపు, ప్లాన్ ఏ – ప్లాన్ బీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తే ఏం చేయాలి అనే ప్రణాళికలు సిద్ధంగా ఉండాలి. ఏమి లేకపోతే కోర్టుల్లో తమని తాము సమర్ధించుకునే “సమర్ధత” అయినా ఉండాలి. ఇవేమి లేకుండా.., ముందుగానే సమకూర్చుకోకుండా జగన్ బృందం మొదటి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తలపడుతుంది.

ap government upper hand on nimmagadda
ap government upper hand on nimmagadda

* “కరోనా కారణంగా.., టీకా పంపిణీ కోసం ఎన్నికలు వాయిదా వేయాలి”..! అనే ఏకైక పాయింటు తప్ప ప్రభుత్వం దగ్గర మరో కారణం లేదు. మరో వాదన లేదు. ఇదే పాయింటుతో కోర్టులో వాదించాలి, గెలవాలి అంటే వ్యవస్థలను మేనేజ్ చేయగల కేంద్రం స్థాయిలో.., అమిత్ షా స్థాయి నుండి నరుక్కుని రావాలి. అలా ఏమి చేయకుండా, ఒక అస్యూరెన్స్ లేకుండా ఒకే ఒక్క వాదనతో కోర్టులకు వెళ్తే రాబోయే ఫలితంపై స్పష్టత ఉండాలి. ప్రభుత్వంలో ఇవి లోపించాయి. ప్రభుత్వమే నేరుగా పిటిషన్ వేయకుండా ఉద్యోగ సంఘాలతో అయినా వేయిస్తే వేరేలా ఉండేదేమో..!!
* కోర్టుల జోలికి వెళ్లకుండా సహాయ నిరాకరణ చేసినా మరోలా ఉండేదేమో. అధికారులు, సిబ్బంది సహకరించడం లేదు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకి వెళ్లేవారేమో..! అలా జరిగితే ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వకుండా ఎన్నికల్లో విధుల్లో ఉండనున్న ఉద్యోగుల సంఘాల ద్వారా సమాధానం చెప్పిస్తే వేరేలా ఉండేది. ఉద్యోగులను ఓరల్ ఆదేశాలతో నడిపిస్తే ప్రభుత్వం దగ్గర కొన్ని చివరి అస్త్రాలు మిగిలేవి. ఇవేమి ఆలోచించక.., తల తోక ఆలోచించకుండా ప్రభుత్వం గుద్ది వాదనలతో నిమ్మగడ్డ విషయంలో తలపడుతుంది.

అటు “కమ్మ”గా నరుక్కొస్తున్నారు..!!

ఇక్కడ జగన్ లాంటి సీఎంని, ఢీ కొంటున్నారు అంటే నిమ్మగడ్డ వెనుక ఎవరున్నారు అనే సందేహం కలగక మానదు. కచ్చితంగా దానికి సమాధానం సామాజికవర్గమే. గత ఏడాది మార్చిలో సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించినట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి తోడు, నీడ అంతా సామాజికవర్గమే. దీన్ని నిజం చేసేలా గత ఏడాది ఆగష్టులో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సామాజికవర్గ/ బీజేపీ పెద్దలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ని నిమ్మగడ్డ కలవడం వాస్తవమే కదా..!! సో.., మొదటి నుండి వారి సామాజికవర్గంలో కొందరు పెద్దలు ఢిల్లీ స్థాయి నుండి కూడా నిమ్మగడ్డకి పరోక్ష సహకారం అందిస్తున్నారు అనేది మాత్రం వాస్తవం.
“అందరూ అనుకుంటున్నట్టు ఇది బయటకు జగన్ X నిమ్మగడ్డ వార్ లా కనిపించినప్పటికీ సైలెంట్ గా, తెరవెనుక మాత్రం రెండు కీలక సామాజికవర్గాల ఈగో పోరులా నడిచింది. అందుకే ఎంతకూ, ఎవ్వరూ తలొంచలేదు. పోరాడుతూనే ఉన్నారు. కోర్టుల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. వారికున్న సర్వాధికారాలూ వాడుతూనే ఉన్నారు. సుప్రీం ఇప్పుడు ప్రభుత్వం వేసిన పిటిషన్ తిరస్కరిస్తే తిరస్కరించవచ్చు.., కానీ జగన్ దగ్గర ఇంకా ఆయుధాలున్నాయి. ఫైనల్ గా “రెండు నెలల కిందట శాసనసభలో ఆమోదించిన ‘ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు వద్దు’ అనే తీర్మానంపై గవర్నర్ సంతకం పెడితే.. విషయం మొదటికి వస్తుంది. ఏమో ఈ అవకాశాన్ని కొట్టిపారేయలేం. మరోవైపు ఇంత రిస్కీ సమయంలో గవర్నర్ సంతకం చేస్తారని కూడా అనుకోలేం..! సో.., ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చు.!

 

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !