NewsOrbit
5th ఎస్టేట్ Featured

మాటలో… ట్వీటులో విరాజిల్లుతున్న “బంగారు తెలంగాణ”…!!

 

అవును బంగారు తెలంగాణ విరాజిల్లుతుంది…! రతనాలతో భాసిల్లుతోంది…! నిండా ఉద్యోగాలతో వర్థిల్లుతుంది..! ఆయురారోగ్యాలతో సంతసిస్తుంది…!! కంగారు పడొద్దు .., నమ్మకం లేకపోతె
అక్కడి “మీడియాలో… కేసీఆర్ అనే దొర మాటలో.. కేటీఆర్ చిన్న దొర ట్వీటులో… పింక్ కప్పుకున్న కళ్ళలో చుడండి. బంగారు తెలంగాణ ఎలా విరాజిల్లుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కరోనా చావులు కనిపించవు. పెరుగుతున్న కరోనా కేసులు కనిపించవు, చేయని కరోనా పరీక్షలు కనిపించవు, గండి పడిన ప్రాజెక్టులు కనిపించవు… కేవలం బంగారంగా కనిపించే పింకు వర్ణమే కనిపిస్తుంది.

ఆ చావుల లెక్కేమిటి…?

* “నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను. నాకు ఆక్సిజన్ తొలగించారు. నాన్నా నేను చనిపోతున్నాను. నా గుండె ఆగిపోయేలా ఉంది, బాయ్ నాన్న…!!” ఈ మాటలు వింటే కరుడుగట్టిన గుండెల నుండి కూడా కన్నీరు ఉప్పొంగుతుంది. కానీ కేసీఆర్ అనే దొర చుట్టును చేరిన పింక్ కాళ్ళ ఈటెలకు ఇవి అబద్ధపు మాటలట…!!
* మరో పేషేంట్ కూడా అదేతీరున మరణించారు. తనకు చికిత్స అందిస్తున్న వార్డులో ఎవరూ ఉండడం లేదని, తనను పట్టించుకోవడం లేదని చెప్పి… అక్కడికి గంటలో మరణించారు.
ఈ రెండు మరణాలపై ప్రభుత్వం చెప్పిన సమాధానాలు వేరుగా ఉన్నాయి. ఒకరికి గుండె సంబంధితో రోగం ఉందని, మరొకరు మానసిక పరిస్థితి బాలేదని చెప్పుకొచ్చారు. ఒకే , వాళ్ళ మాటనే అంగీకరిద్దాం…!! “నాలుగు రోజుల కిందట మరణించిన నర్సు సంగతి ఏంటి..?? గత నెలలో మరణించిన టివి 5 రిపోర్టర్ మనోజ్ సంగతి ఏంటి..? వీళ్ళు చెప్పిన నిజాలు అసలు పింకు కళ్ళకి కనిపిస్తేనే కదా..!!

ఇంతటి అలక్ష్యం కేసీఆర్ సొంతం…!

తన మాట తనది… అడిగే వారు ఉండరు.., ఉండకూడదు… ఉంటె ఇక వారికి మూడినట్టే…! తెల్నగన వచ్చిన తర్వాత కేసీఆర్ నైజం ఇదే. మీడియాని గుప్పిట పెట్టుకుని., న్యూస్ పేపర్లని.., పింక్ పేపర్లుగా మార్చేసి.. తన మాటలు అచ్చయ్యేయీల చేసుకుని… సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని.. ప్రత్యర్ధులు లేకుండా చేసి.., వారు ఉన్నా .., వారి మాటకి విలువ లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించడమే కేసీఆర్ దొరతనం. కరోనా కట్టడి కోసం తాను బీభత్సంగా పని చేస్తున్నట్టు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. అప్పటికి కరోనా నియంత్రణలోనే ఉంది… కానీ ఎప్పుడైతే కరోనా నియంత్రణ కోల్పోయి విజృంభించిందో.., ఇక కేసీఆర్ మాటలు చెల్లుబాటవ్వలేదు. అందుకే మీడియా ముందుకి రావట్లేదు.
* ముగ్గురు ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చింది. వారి చుట్టూ తిరిగిన అనుచరులకు పరీక్షలు చేయకుండా ఇళ్లకే పరిమితం చేసారు.
* రెండు రోజుల కిందట హోమ్ మంత్రికి పాజిటివ్ వచ్చింది. అక్కడికి రెండు రోజుల ముందు ఆయన హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 300 మంది ఆ కార్యక్రమం లో పాల్గొన్నారు. వారికి టెస్టులు చేయలేదు.
* నిన్న డిప్యూటీ సుపీకేర్ పద్మారావుకి పాజిటివ్ అని తెలిసింది. ఈయన గడిచిన పది రోజుల్లో దాదాపు 500 మందిని కలిసారుట.
* తెలంగాణలో అన్నిటికంటే అతి తీవ్రమైన సమస్య ఏమిటంటే… అసలు అక్కడ కరోనా పరీక్షలు చేయట్లేదు. అనేక కారణాలు, సాకులు చూపించి ప్రస్తుతం టెస్టులు ఆపేసారు. మూడు రోజుల కిందట చేసిన టెస్టుల ఫలితాలు నిన్న, మొన్నా వచ్చాయి. ఈరోజు సాయంత్రం నుండి మల్లి టెస్టులు మొదలెట్టే అవకాశం ఉంది.
* తెలంగాణాలో ప్రముఖ ఆసుపత్రులు నిమ్స్, గాంధీ, ఉస్మానియా… కొత్తగా టైమ్స్ కూడా కరోనా చికిత్సకు ఉన్నాయి. వీటన్నిటినీ కాదు అని… మల్లారెడ్డి అనే మంత్రికి చెందిన మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీలో కరోనా వైద్యం అందించేలా అనధికార ప్రయత్నాలు చేసి.., ఫలితం పొందుతున్నారు. ఇదీ బంగారు తెలంగాణ అంటే… ఏమంటారు..? నిజమే కదా…? పింక్ వర్ణమున్న బంగారు తెలంగాణ ఇదే..!!

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau