5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

కుప్పి గంతులు.. కుళ్ళు జోకులు.. ఎమ్మెల్యేగా ఏడుపులు..! రోజా సాధించింది ఏమిటి..!?

Share

టీవీల్లో షోల పేరుతో కుప్పి గంతులు.. జబర్దస్త్ లో కుళ్ళు జోకులు.. అప్పుడప్పుడూ వయసుకి తగని వేషాలు.. నియోజకవర్గంలో అంతర్గత గొడవలు.. ఎమోషన్ ఆపుకోలేక ఏడుపులు.. రాజకీయ అపరిపక్వతలు.. ఇవీ రోజాలో ఇప్పుడు కనిపిస్తున్నాయి..! వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా… మొదటి నుండి పార్టీ కోసం కష్టపడిన నేతగా ఉన్న రోజాకి సీఎం జగన్ ఆమె ఆశించిన స్థానం ఇవ్వలేదు. రాష్ట్ర స్థాయిలో కాదు కదా.., కనీసం ఆ జిల్లాలోనూ ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. పైగా నియోజకవర్గంలో కూడా ఆమెకి చిక్కులు, తలనొప్పులు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఎదురవుతున్నాయి..!! వీటికి కారణం ఏమిటి..? ఆమె వ్యవహార శైలీనా..? ఆమె తెలియని తనమా..? పార్టీలో ఆమెకి ప్రత్యర్ధులా ..!?

ఆమె వ్యవహార శైలి భిన్నం..!!

రోజా వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఏ మహిళా నేతకు లేని గట్స్ ఆమెలో ఉన్నాయి. అవే ఆమెకు ప్లస్.., అవే ఆమెలో మైనస్ కూడా. ఆమె మాటలు పార్టీకి ఎంత మంచి చేశాయో.., ప్రత్యర్థులకు ఎంత ఇబ్బంది పెట్టాయో… పార్టీకి అంతే చేటు చేశాయి.., ప్రత్యర్థులకు అంతే మేలు కూడా చేశాయి. అసందర్భంగా అతిగా రియాక్ట్ అవ్వడం.., అనవసరంగా వివాదాల్లో దూరడం రోజాకి అలవాటుగా మారింది. 2014 లో తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రోజా అసెంబ్లీలో తన వాగ్ధాటిని మరింత పదునెక్కించారు. మొత్తానికి ఒక మహిళా నాయకురాలిగా వైసీపీకి ఆమె మొదట్లో ప్లస్ అయినప్పటికీ… మహిళా ప్రజాప్రతినిధిగా మాత్రం పూర్తిగా సక్సెస్ అవ్వలేదు. ప్రతిపక్షంలో ఉండడం వలన.., అధికార పక్షంతో కయ్యాల వలన రోజా పెద్దగా పనితీరులో ప్రభావం చూపలేదు.

ప్రభుత్వం వచ్చాక సూన్యమే..!!

2019 లో నగిరి నుండి వరుసగా రెండోసారి రోజా గెలిచారు. మొదటి సారి ఎమ్మెల్యేగా 858 ఆధిక్యతతో గెలిచిన ఆమె.., రెండోసారి 2019 లో జగన్ గాలిలో కూడా కేవలం 2700 ఆధిక్యతతో మాత్రమే గెలిచారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆమెకు ప్రాధాన్యత తగ్గింది. సొంత నియోజకవర్గంలో శత్రువులు పెరిగారు. కె. కుమార్ అనే నేతతో రోజాకు విభేదాలు పెరిగాయి. తద్వారా ఎమ్మెల్యే రోజాకి వ్యతిరేక వర్గం ఏర్పడి మాటి, మాటికీ పిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రోజాకి రావాల్సిన మైలేజి రాకపోగా ఆమె మాటని అధికారులు కూడా సీరియస్ గా తీసుకోవడం లేదు. అందుకే ఆమె ఎమోషన్ ని ఆపుకోలేక కన్నీరు కార్చి ఉండవచ్చు..! అయితే ఇక్కడ కొన్ని కీలక పాయింట్లు చర్చించుకోవాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మాటల్తో, వాగ్ధాటితో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టిన రోజా ఇప్పుడు ఎందుకు వెనుకబడుతున్నారు అనేది సందేహంగా మారింది..!!

షోలు ..వేషాలు.. గంతులు..!!

ఆమె టీవీ షోల్లో చాల బిజీ అయ్యారు. ఇది ఆమె వృత్తి. వెండితెరలో నవ్వుల రాణిగా పేరు తెచ్చుకున్న ఆమె.., బుల్లితెరపై కూడా తన నవ్వుతో అలరిస్తూ జబర్దస్త్ లో జడ్జిగా పేరు గాంచారు. జబర్దస్త్ కాస్తా వేషాలు పెరిగి, పెరిగి.. అసభ్యత పెరిగి.., తింగరి స్కిట్లు పెరిగి.. రోజాపై కూడా కొంత ప్రభావం పడింది. ఆమె కూడా రంగుల రంగుల లంగాఓణీలతో వస్తా చిందులేశారు. అప్పుడప్పుడూ వయసుకి, ఎమ్మెల్యే హొదాకి తగని విధంగా ప్రవర్తనలు, డాన్సులు ఉంటున్నాయని అపవాదు ఉంది. ఈ షో తో పాటూ అదనంగా వారంలో మరో రెండు,. మూడు షోలు కూడా నిర్వహించేవారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేగా పూర్తిస్థాయిలో ఉండలేక.. ఇటు షోలు వదులుకోలేక.., రాజకీయంగా పట్టు సాధించలేక.. వ్యతిరేకతని ఆపలేక.. అధికారులపై పట్టు కోల్పోయి ఉండవచ్చు. సో… ఇవన్నీ కలిసి రాజాని వెండితెర రాణిగా నిలబెట్టాయి కానీ.., ఎమ్మెల్యేగా, రాజకీయ నేతగా పట్టు సాధించేలా చేయలేకపోయాయి. దీనిలో ఆమె స్వయంకృతాపరాధం కొంత.., పార్టీలో ఆమె ఎదుగుదల నచ్చని నేతల తెరవెనుక డ్రామాలు కొంత పనిచేసాయి…!!


Share

Related posts

దళిత ఎమ్మెల్యే..! బ్రాహ్మణ యువతి..! ఓ తమిళ ప్రేమకథ..! క్లైమాక్స్ ఏమవుతుంది..!?

Srinivas Manem

103 ఏళ్ల వయసులో ఈ తాత చేసిన సాహసం చూస్తే అవాక్కవుతారు..!

Varun G

జ‌గ‌న్ , చంద్ర‌బాబు… సీట్లో ఎవ‌రున్నా వీళ్ల‌ను ఏం చేయ‌లేరు తెలుసా?!

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar